టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ మరియు మహేష్ బాబు మేజర్ పాత్రలో ఉన్న పోస్టర్లు బయటకు రాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమాలోని విజయశాంతి గారి లుక్ ని నేటి ఉదయం రిలీజ్ చేసిన యూనిట్, 

కాసేపటి క్రితం మహేష్ బాబు స్టైలిష్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. మహేష్ బాబు స్టయిష్ టీ షర్ట్ మరియు ట్రాక్ ప్యాంట్ వేసుకుని, బుల్లెట్ బైక్ మీద వెళ్తున్న ఆ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్టర్ ని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవడం ఖాయం అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి గారు భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సంగీత, బండ్ల గణేష్, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస రెడ్డి

హరితేజ తో పాటు ప్రకాష్ కూడా మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రఫీని, అమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పటికే రోజురోజుకు ఎన్నో అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఆ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: