మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. డాన్ శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ర‌వితేజ 66వ చిత్ర‌మిది.


ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామ‌ని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది. 


 రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాల్నీ షూట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్‌లోని ఐస్ ల్యాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రికరించనున్నారు. ఈ తాజా షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో 4 నిమిషాలు ఉండే ఓ సన్నివేశం కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారట.

అందుకోసం హలీవుడ్ సినిమా 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7’కు పనిచేసిన టీమ్‌ను ఉపయోగిస్తున్నారు. వీటికి తోడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయని చెబుతోంది చిత్ర బృందం. రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేషా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: