టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి నటరత్న ఎన్టీఆర్ గారి నట వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువరత్న నందమూరి బాలకృష్ణ గారు, తొలి సినిమా నుండి తన ఆకట్టుకునే నటనతో, ఒక్కొక్కటిగా విజయాలు అందుకుంటూ ఎందరో ప్రేక్షకులను సంపాదించారు. ఇకపోతే ఇటీవల ఈ ఏడాది ప్రారంభంలో ఆయన హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో, తన తదుపరి సినిమాతో ఎలాగైనా గట్టిగా హిట్ కొట్టాలనే సంకల్పంతో, గత ఏడాది తనతో జైసింహా సినిమాను తెరకెక్కించిన కేఎస్ రవికుమార్ కే దర్శకుడిగా మరొక అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాకు రూలర్ అనే టైటిల్ ని నిన్న మధ్యాహ్నం నిర్ణయించి రివీల్ చేయడం జరిగింది. 

ఇక ఈ టైటిల్ పోస్టర్ ని బట్టి చూస్తే బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే అంశం ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అనడానికి కారణంగా మారింది. ఇప్పటివరకు తన కెరీర్లో బాలకృష్ణ గారు పోలీస్ పాత్రల్లో నటించిన సినిమాల్లో దాదాపుగా ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించడంతో, తప్పకుండా ఈ రూలర్ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాదిస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఉన్నారు. 

జైసింహాలో బాలకృష్ణను ఆకట్టుకునే పాత్రలో చూపించిన కేఎస్ రవికుమార్ గారు, అంతకు మించేలా బాగా ఎంటర్టైన్మెంట్, మరియు మాస్ అంశాలను జోడించి ఈ సినిమాలోని ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను సృష్టించడం జరిగిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఒక స్పషల్ క్యారెక్టర్ నటిస్తోంది. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈసారి బాలకృష్ణ గారికి పోలీస్ పాత్ర ఎంతమేర విజయాన్ని అందిస్తుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: