ఏడాదికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు దేశంలోనే ఎక్కువ. అయితే.. ఇటీవల పరిశ్రమలో ప్లానింగ్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. రిలీజ్ సరిగా ప్లాన్ చేసుకోకపోవటం వల్ల పోటీ ఎక్కువవుతోంది. దీని వల్ల తెలుగు సినీ పరిశ్రమే నష్టపోతోంది. అసలే పండుగ సీజన్. ఖచ్చితంగా తెలుగు సినిమా రావాల్సిందే. ప్రేక్షకుల ఎదురుచూపులు కూడా ఎక్కువే. కానీ ఏం జరిగింది.. ఈ దీపావళికి ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకుండా పోయింది.

 


రెండు అరవ సినిమాలు మాత్రం తమ సొంత చిత్ర పరిశ్రమలా వచ్చేశాయి. ఏ తెలుగు సినిమా కూడా ఇలా తమిళంలో విడుదయ్యే పరిస్థితులు లేవు. కానీ దీపావళికి ఇక్కడకు వచ్చేశారు. మన సినిమాలకు రావాల్సిన కలెక్షన్లన్నీ ఇప్పుడు తమిళ సినిమాలకే పోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎంతమాత్రం సరైంది కాదు. మహామహులైన నిర్మాతల.. దిగ్దర్శకుల.. ఎన్నో సినిమాలు నిర్మాణ దశలో ఉన్నా కానీ ఒక్క తెలుగు సినిమా కూడా ఈ దీపావళికి రాలేకపోయింది. ఇదంతా ఎవరి వైఫల్యమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ‘అబ్బా.. తమిళ సినిమానా.. తెలుగు సినిమాకు పోదాం’ అనుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నా.. వారికి ఈ పండుగ స్పెషల్ తెలుగు సినిమా లేకపోయింది.

 


డిసెంబర్ 20నే మూడు సినిమాలు వచ్చే బదులు ఈ పండుగకు ఒక్క సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకున్నా అరవ సినిమాల మధ్య తెలుగు సినిమాకు కలెక్షన్లు వచ్చేవి. సంక్రాంతికి పోటీ పడేకన్నా దీపావళికి ప్లాన్ చేసుకున్నా కలెక్షన్లు తీసుకెళ్లే వారు. తమిళ పరిశ్రమలా టాలీవుడ్ పెద్దలు గట్టిగా లేనంత కాలం ఇదే జరుగుతూంటుంది. 2005లో గజినీ, చంద్రముఖి, అపరిచితుడు, మన్మథ.. వంటి సినిమాలు మన తెలుగు నుంచి 100 కోట్ల వరకూ కలెక్ట్ చేశాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటే బెటర్.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: