తెలుగు పండుగలకు ఒక్కో దానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అందులో అతి ముఖ్యమైనది దీపావళి. దీపావళి వేడుకకు ఓ విశిష్టత ఉంది. అదేంటి అంటే పెద్దలను, పిల్లలను ఒకటిగా చేస్తుంది. అందరినీ పిల్లలుగా  మార్చేస్తుంది. ఓ పాటలో సినీ కవి అంటాడు. పెద్దలంతా పిల్లలుగా మారే రోజు , అమావాస్య నాడు  వచ్చే పున్నమి రోజు, వెన్నెల రోజు. దీపావళి రోజు అని. అంటే దీపావళి మీద  ఓ మంచి పాట అలా కుదిరింది అన్నమాట.


పాట రామయ్య తండ్రిలోనిది. రాసినది సహజకవి మల్లెమాల. ఆయన అసలు పేరు, ఎమ్మెస్ రెడ్డి. ఆయన పాటలన్నీ ఆణిముత్యాలే. ఇక విచిత్ర బంధం అని అక్కినేని, వాణిశ్రీ జంటగా మరో మూవీ ఉంది. అందులో  చీకటి వెలుగుల రంగేళి. జీవితమే దీపావళి అంటూ సాగే పాట, దీపావళి విశిష్టతను తెలియచేస్తుంది. దీన్ని మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసారు.


ఇక ఆడే పాడే పసివాడా అంటూ దీపావళి సందర్భంగా వచ్చే పాట అక్కినేని  హీరోగా వచ్చిన పెళ్ళి కానుక మూవీలోనిది. ఏం రాజా సంగీతంలో వచ్చిన ఈ పాటకు   ప్రముఖ  రచయిత ఆచార్య ఆత్రేయ  సాహిత్యం అందించారు. ఇక అంజలిదేవి సొంతంగా   తీసిన  చిత్రం కన్నవారిల్లులో కూడా దీపావళి పాట అలరిస్తుంది. 


దీపావళి విశిష్టతను తెలియచేస్తూ ఏకంగా అన్న నందమూరి సావిత్రి నటించిన చిత్రం కూడా ఉంది. అందులో కూడా దీపావళి పాటలు  ఉన్నాయి. దీపావళి గురించి బయట కవుల కంటే సినీ కవులు ఎంతో అందంగా సగటు  జనానికి అర్ధమయ్యేలా రచనలు చేసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందించారు. మొత్తం మీద దీపావళి గొప్ప పండుగే కాదు. మన గురించి తెలియచెప్పే అసలైన వేడుక కూడా.



మరింత సమాచారం తెలుసుకోండి: