భారతీయ సంస్కృతిలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపడమే కాకుండా మనలోని అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే మహత్తరమైన శక్తి దీపానికి ఉంది. దీపాల పండుగగా దీపావళిని జరుపుకునే సాంప్రదాయం ద్వాపరయుగం నుండి కొనసాగుతూనే ఉంది. 

దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయడం ఎంతోమంచిది కాబట్టి పొద్దున్న తల స్నానం చేసి ఆతరువాత తెల్లటి దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది అని మన నమ్మకం. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో జరుపుకునే అపురూపమైన పండుగ దీపావళి. దీపావళి రోజున మాత్రమే దీపాలను ఎందుకు పెడతారు ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అన్న విషయంలో అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కార్తీక మాసంలో తులసిని పూజించి తులసి ముందు ఒక్క దీపాన్నైనా ఉంచితే మంచి జరుగుతుందని మన నమ్మకం. 

అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం కూడ ఉంది. ముఖ్యంగా మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానకి పితృదేవతలు దిగి వస్తారని మన పెద్దలు అంటూ ఉంటారు. అలా వచ్చి వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చింది అంటారు. పురాణాల ప్రకారం దీపావళి పండగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు. వ్యాపారాభివృద్ధి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీకటాక్షం కోసం పూజలు చేస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనేతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం  కలుగుతుందని నమ్మకం. ఈ రోజు వెలిగించే ప్రతి దీపం లో  లక్ష్మీదేవి  ఉంటుంది అంటారు. ఈ రోజు  ‘శ్రీమహాలక్ష్మి’ ని త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులు అందరికి ‘మహాలక్ష్మి’ అనుగ్రహం కలిగి ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఎన్నో కధలు పురాణాలలో కనిపిస్తాయి.   

వేదకాలం నుండి  దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. శాస్త్రీయ కోణంలో చూసినా దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు మతాబులు వాటి నుంచి వచ్చే పొగ దోమలు మొదలైన క్రిమి కీటకాలను చచ్చిపోయేలా చేస్తుంది. దీపావళి ని  ఐదు రోజుల పండుగ.గా జరుపుకుంటారు

ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలి పాడ్యమి అంటూ ఈ దీపావళిని మనదేశం లోని చాలా ప్రాంతాలలో  అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు.    
శ్రీకృష్ణుడు పురుషుడు సత్యభామ ప్రకృతి నరకుడు దుష్టగుణాలకు చిహ్నం. అగ్నిస్వరూపమైన దీపం జ్ఞాన సత్యనిర్మలతలకు సంకేతం. ఇలా అన్నో అత్యదిమిక విషయాలు ఈ పండుగులో ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న దీపావళి అందరికి సుఖ సంతోషాలు అందించి  జ్ఞానామృతాన్ని పంచి అందరికి మంచి కలగాలని ఇండియన్ హెరాల్డ్ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: