టాలీవుడ్ కి సంబంధించిస ‘మా’ అసోసియేషన్ ఒక బాధ్యతాయుతమైన అసోసియేషన్. 900 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ అసోసియేషన్ నటీనటుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికగా చూస్తూంటారు. ప్రతి రెండేళ్లకోమారు జరిగే మా ఎన్నికలు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తాయి. సార్వత్రిక ఎన్నికల తరహాలో ఆ కొద్ది రోజులు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారతాయి. కానీ ఇటివల మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిణామాలు అసోసియేషన్ ను నవ్వులపాలు చేస్తున్నాయి.

 


ఇటివల జరిగిన ‘మా’ సమావేశం రసాభసగా మారిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు నరేశ్ లేకుండా జీవిత, రాజశేఖర్ ఈ సమావేశ నిర్వహించడం పలు విమర్శలకు దారి తీసింది. దీంతో వారి మధ్య ఉన్న విబేధాలు బయటకొచ్చాయి. దీంత మా పరువు ఒకింత పోయిందనే చెప్పాలి. ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు దీనిపై దిద్దుబాటు చర్యలకు సినీ పెద్దలు రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘మా’ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి ఇందుకు పూనుకున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు కృష్ణంరాజు, మోహన్ బాబు కూడా ‘మా’ లోని విబేధాలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారని వినికిడి. దీపావళి తర్వాత వెంటనే దీనిపై అందరినీ పిలిచి మాట్లాడాలని సినీ పెద్దలు తలచారట.



నిజానికి ‘మా’లో విబేధాలు అంతర్గతం. కానీ మీడియాలో అవన్నీ వచ్చేయడంతో ఇలా బయటకు ఎలా చెప్తారని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ‘మా’ అధ్యక్షుడి ఎన్నికల సమయంలో చిరంజీవి సపోర్ట్ లేకుండా, ఆయన పరోక్ష మద్దతు లేకుండా ఏ ప్యానెల్ కూడా ఎంపిక కాదు. దీంతో ఆయనే రంగంలోకి దిగి, ఆధిపత్య పోరు లేకుండా చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే మా పరువు పోయిన నేపథ్యంలో ఈ దిద్దుబాటు చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: