విజయ్ దేవరకొండ హీరోగా పెళ్లిచూపులు సినిమాను డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ సడెన్ గా హీరో అయిపోతాడని ఎవరు ఊహించి ఉండరు. మీకు మాత్రమే చెప్తా అంటూ తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా వస్తుందని తెలిసిందే. నవంబర్ 1న ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించడం విశేషం. 


షమ్మీర్ సుల్తాన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. డైరక్టర్ అయ్యుండి తను హీరోగా అవడానికి గల కారణాలు వివరించాడు తరుణ్ భాస్కర్. అయితే దీని వెనుకాల జరిగిన కథ ఏంటంటే.. ఈ డైరక్టర్ ఈ కథను విజయ్ దేవరకొండ కోసం రాశాడట. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజ్ కు ఇది చేయడం కుదరదని చెప్పి తరుణ్ భాస్కర్ ను హీరోగా చేయమని విజయ్ రిఫర్ చేశాడట.


అయితే తను హీరోగా చేయడం గురించి రకరకాల కామెంట్స్ వచ్చాయి. వాటిని తను అసలు పట్టించుకోనని అంటున్నాడు తరుణ్ భాస్కర్. ఎవరేం అనుకున్నా తను చేసేది తనకు తెలుసని.. తనకు నటించడం కన్నా డైరెక్ట్ చేయడమే ఇష్టమని అన్నాడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ చేయడం కుదరక ఈ సినిమా తను చేయాల్సి వచ్చిందని అన్నాడు తరుణ్.     


అయితే ఇది ఓ మిడిల్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కథ అందుకే తను ఈజీగా చేయగలిగానని అన్నాడు తరుణ్ భాస్కర్. ఒకవేళ ఈ సినిమాతో హీరోగా అతను సక్సెస్ అయితే డైరక్టర్ గానే కాదు హీరోగా కూడా తరుణ్ భాస్కర్ బిజీ అయ్యే అవకాశం ఉంది. తరుణ్ భాస్కర్ హీరోగా తొలిప్రయత్నంగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో అనసూయ కూడా స్పెషల్ రోల్ చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: