టాలీవుడ్ లో క్లిక్ అయిన ఉత్తరాది భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రకుల్ బేబీ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వెను వెంటనే పెద్ద హీరోలతో ఆఫర్లు వరుస కట్టాయి. ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేసిన రకుల్ తొలిసారి ఐటమ్ భామగా మారింది ఓ హిందీ సినిమాలో.

 


బాలీవుడ్ లో తెరకెక్కిన మార్జవాన్ సినిమాలో రకుల్ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో రకుల్ చాలా సెక్సీగా ఉంది. వైట్ సిల్క్ శారీలో లో స్లీవ్ లెస్ లో రకుల్ యమ హాట్ గా ఉంది. దీంతో ఈ పాటకు సెక్సీ లుక్ వచ్చేసింది. ‘హైయా హో..’ అంటూ సాగే ఈ పాటకు తనిష్క్ బాగ్జీ సంగీతం అందిస్తే.. తులసిపాట పాడింది. రకుల్ వయ్యారాలు బాలీవుడ్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మొన్నామధ్య అజయ్ దేవ్ గన్ తో నటించిన దే దే ప్యార్ దే లో కూడా రకుల్ బాగానే గ్లామర్ షో చేసింది. ఆ సినిమా కోసమే స్పెషల్ డైట్ మెయింటైన్ చేసింది కూడా. ఇప్పుడు మార్జావాన్ లో కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తూ సెక్సీ అందాలతో కవ్విస్తోంది.

 


మార్జావాన్ మేకర్స్ ఆ పాటను రకుల్ తో చేయటం మంచి చాయిస్ అనే చెప్పుకోవచ్చు. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. నాజూకు అందంతో, స్లిమ్ బాడీతోపాటు నటన కూడా బాగా ఉండటంతో రకుల్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.  

 


view this post on Instagram

Iss diwali, jalegi #HaiyaHo ki chingari! song link in bio! #MarjaavaanOn15thNov @riteishd @sidmalhotra @tarasutaria @tanishk_bagchi @jubin_nautiyal @tulsikumar15 @milapzaveri @bhushankumar #KrishanKumar @onlyemmay @madhubhojwani @nikkhiladvani @divyakhoslakumar @ravikishann @emmayentertainment @tseriesfilms @tseries.official @marjaavaanthemovie @im__sal @aliyashaik28

A post shared by Rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి: