టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ, భరత్ అనే నేను తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దసరా రోజు ముహుర్త కార్యక్రమాలు పెట్టుకున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ మూవీని కూడా రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడు.  


చిరు సరసన త్రిష హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే సినిమాలో మెగాస్టార్ మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ కూడా ఉన్నాడట. అవును కొరటాల శివ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇద్దరు ఒకేసారి కనిపిస్తారా అంటే కష్టమే అని తెలుస్తుంది. 


అదేంటి అంటే చిరు యంగ్ రోల్ లో రాం చరణ్ కనిపిస్తాడట. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా చరణ్సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. జనవరి కల్లా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నాడు రాజమౌళి. కాని ఇద్దరి హీరోలకు గాయాలవడం.. రాజమౌళి కొడుకు పెళ్లి అవడం ఇవన్ని సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగించాయి.


అయితే రాజమౌళి సినిమా షూటింగ్ చేస్తూనే చిరు సినిమాలో కూడా నటిస్తాడట రాం చరణ్. కొరటాల శివ సినిమాలో కూడా చరణ్ కు మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకే సినిమాలో చిరంజీవి, చరణ్ కనిపిస్తే ఇక మెగా ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: