నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు టెలివిజన్  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3.ఈ షో చివరి అంకానికి చేరుకుంది. మరో వారంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. 14 వారాల పాటు తెలుగు ప్రేక్షకులు అందరిని అలరించిన ఈ షో  ప్రస్తుతం మరో వారంలో ముగియనుంది . అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 స్టార్ట్ అయిన మొదటి వారం నుంచి నామినేషన్లు ఎలిమినేషన్ల  ప్రక్రియ మొదలైంది. సభ్యుల్లో కొంతమంది ని నామినేట్ చేయడం నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని  ఎలిమినేట్ చేయడం గత 14 వారాలు గా కొనసాగుతున్న  విషయం తెలిసిందే. 

 

 

 

 బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే . టెలివిజన్ ప్రేక్షకులకు టీవీలకు  కట్టిపడేసేలా  బిగ్ బాస్ షో అలరిస్తోంది. వారం చివర్లో నాగార్జున వచ్చి  ప్రేక్షకులకు మరింత  ఎంటర్టైన్మెంట్ పంచుతారు. అయితే తాజాగా దసరా పండక్కి హౌస్ లోకి వెళ్ళిన నాగార్జున హౌస్ లో రెండు ఎపిసోడ్ ల  పాటు సందడి చేసిన విషయం తెలిసిందే. నాగార్జున హౌస్ లోకి వెళ్లడంతో హౌస్ లో సందడే మారిపోయింది. కాగా  బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరు మంది సభ్యులు ఉండగా.. దీపావళికి మరో సర్ప్రైస్ ఇవ్వనున్నారు బిగ్ బాస్. 

 

 

 

 అయితే బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వచ్చినట్లు  తెలిపారు నాగార్జున . దీనికి సంబంధించిన ప్రోమో కూడా స్టార్ మా రిలీజ్ చేసింది . విజయ్ దేవరకొండ హౌస్ లోకి వెల్లి తన బెడ్ రూమ్ లో హౌస్ మేట్స్ మీట్ అయ్యారు . ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పెళ్లి పై వచ్చిన రూమర్స్ గురుంచి విజయ్ ని  అడిగారు నాగార్జున. దాంతో విజయ్ తన కు ఇంకా అమల  దొరకలేదు అని నాగ్  పైనే  సెటైర్ వేశారు. దీంతో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ని  అమల తొందరగా దొరకాలని కోరుకుంటున్నాం అంటూ విష్ చేశారు. కాగా నేడు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే 14 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో లో టాస్క్ ల్లో సభ్యులు ఆటలు రసవత్తరంగా మారాయి. మరో వారం రోజుల్లో విజేత ఎవరో తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: