సినిమాల్లో హిట్, ఫ్లాపులతో సంబంధంలేని నేటి జనరేషన్ హీరోల్లో పవన్ ది నెంబర్ వన్ ప్లేస్. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే భారీ ఫ్యాన్ బేస్ ను, పీక్స్ లో ఉన్న కెరీర్ ను, ఉన్నత స్థానాన్ని వదిలేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సినిమాలు కూడా చేయాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ.. పవన్ సినిమాలు చేస్తారంటూ ఓ రూమర్ అయితే ఉంది.  



పవన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయినా అన్న కొడుకు చరణ్ నుంచి మాత్రం ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దీంతో మెగా, పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉండిపోయారు. రావల్సిందల్లా పవన్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే. ‘బాబాయ్ చాలా కథలు వింటున్నారు.. కానీ ఇంకా ఏ విషయం కన్ఫర్మ్ చేయట్లుదు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ సినిమాలు చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే. ఈ వార్త చాలు.. పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవటానికి. ఇప్పటికే పవన్ సినిమాను మైత్రీ సంస్థ, ఏ ఎమ్ రత్నం.. నిర్మిస్తారని టాలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. చరణ్ స్టేట్ మెంట్ తో ఈ వార్తలో కొంత నిజముందని తెలిసిపోయింది.

 


టాలీవుడ్ లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేని సీనియర్ హీరోల్లో చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ కి మాత్రమే ఆ ఘనత సాధ్యమయింది. ఖుషీ తర్వాత పదేళ్లు ఆ స్థాయి హిట్ లేకపోయినా ఆయన సినిమా బిజినెస్, కలెక్షన్లలో ఏ తేడా రాలేదు. అజ్ఞాతవాసి మొదటి రోజు కలెక్షన్లు కూడా ఓ ఉదాహరణ. చరణ్ స్టేట్ మెంట్ తో పవన్ సినిమా చేయాలంటూ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరగడం ఖాయం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: