తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదలపై పలు రకాల పుకార్లు వస్తున్నాయి. సినిమా నిర్మాణం లేట్ అవుతోందని, విడుదల దసరాకు ఉండొచ్చని.. లేదంటే 2021 సంక్రాంతికి ఉండొచ్చని వార్తలు రౌండ్ అవుతున్నాయి. దీనిపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

 


ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై స్పందిస్తూ.. ఈ సినిమా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతోందనీ.. రిలీజ్ తేదీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ రూమర్సేనని కొట్టి పారేశాడు. అనుకున్న తేదీకే సినిమా వస్తుందని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయింది. అయితే ఈ వార్తలు రావడానికి కారణాలు లేకపోలేదు. మొదట చరణ్ గాయపడటంతో షూటింగ్ డిలే అయింది. తర్వాత ఎన్టీఆర్ కూడా గాయపడటంత మరో షూటింగ్ కు మరో అవాంతరం వచ్చింది. ఇలా కొన్ని అవాంతరాల మధ్య సినిమా షూటింగ్ జరుగుతూండటంతో ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ లో రౌండ్ అవుతున్నాయి. మొత్తానికి చరణ్ స్టేట్మెంట్ తో ఓ క్లారిటీ అయితే వచ్చింది.

 


ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచీ ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నాడు నిర్మాత దానయ్య. ఈ సినిమాపై జాతీయస్థాయిలో బజ్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: