మరో వారం మినహా బిగ్ బాస్ సీజన్ 3 ముగియనుంది. ఇప్పటికే దాదాపు 90 రోజులకు పైగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ అభిమానులను అలరించిన తెలుగు సీజన్ 3...ఇప్పటికే ఇంటిలో ఆరుగురు సభ్యులు ఉండటంతో ఇంటిలో వాతావరణం మొత్తం చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈరోజు జరిగే ఎపిసోడ్ లో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది పెద్ద హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మరియు బిగ్ బాస్ వీక్షకులను టెన్షన్ పుట్టించే విధంగా ఉంది. వచ్చేవారం టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రేసులో ఎక్కువగా శ్రీముఖి మరియు రాహుల్ పేర్లు ఎక్కువగా వినపడుతున్న క్రమంలో ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్.


ఈ పరిణామంతో ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతిలలో ఒకరు ఎలిమినేట్ అయి.. ఇద్దరు ఫైనల్ కు చేరాల్సి ఉంది. అందుతున్న లీకుల ప్రకారం శివజ్యోతి ఎలిమినేట్ కావడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అలీ, వరుణ్ లతో పోల్చుకుంటే శివజ్యోతికి తక్కువ ఓట్లు వచ్చినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ రోజు ఎపిసోడ్ లో మరో సర్ప్రైజ్ ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.


ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 3లో సెలబ్రిటీలు ఎవరూ హౌస్ లోకి ప్రవేశించలేదు. కేవలం నాగ్ పక్కన వేదికపై మాత్రమే హౌస్ మేట్స్ కు కనిపించారు. కానీ తొలిసారి విజయ్ దేవరకొండ హౌస్ లోకి సీక్రెట్ గా ప్రవేశించి ఇంటి సభ్యులని కలుసుకోబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆ దృశ్యాల్ని చూపించారు. విజయ్ దేవరకొండ హౌస్ మేట్స్ కి తెలియకుండా సీక్రెట్ రూమ్ లోకి ప్రవేశించగా.. మొదట అతడిని కలుసుకునే అవకాశం శివజ్యోతికి వచ్చింది. దీంతో ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: