మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా అక్టోబర్ రెండవ తారీకున గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన విషయం మనకందరికీ తెలిసినదే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొట్టమొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజులో రాబట్టిన 'సైరా' సినిమా దసరా సెలవులు బాగా క్యాష్ చేసుకుని అదిరిపోయే కలెక్షన్లు మొట్ట మొదటి రోజుల్లో సాధించి మంచి లాభాలు మొదట్లో తీసుకురాగా తర్వాత పెద్దగా ఈ సినిమా రావట్లేదని నష్టాలు కూడా చివర్లో వచ్చాయన్న వార్తలు ట్రేడ్ వర్గాల నుండి వస్తున్నాయి. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతమైన రేంజ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందే స్టార్ట్ చేయటంతో.. మొత్తంగా 180 కోట్లకు పైగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


ఈ మొత్తాన్ని రాబడితేనే ఇప్పుడు సైరా హిట్టయిందా ఫట్టయ్యిందా అన్నది టాక్ తో సంబంధం లేకుండా ట్రేడ్ వర్గాల వారు షాకింగ్ కామెంట్లు చేశారు. కానీ సినిమాకు మొదటి రోజు భారీ స్థాయి వసూళ్లు ఎలా అయితే వచ్చాయో అంతే స్థాయి నష్టాలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతానికి అయితే ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల షేర్ ను మాత్రమే టచ్ చెయ్యగలిగింది అని ఇంకా 40 కోట్లుకు పైగా రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.


ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత కలెక్షన్లు రావటం అసాధ్యం అని చాలా మంది ట్రేడ్ వర్గాలకు చెందిన వారు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే ముందు వచ్చిన టాక్... బ్లాక్ బస్టర్ అని వచ్చిన కానీ తర్వాత రానురాను కలెక్షన్లు తగ్గటంతో చివరిలో 'సైరా' సినిమా పెద్దగా కలెక్షన్లు సాధించలేదని చివరగా వచ్చిన లెక్కల బట్టి వార్తలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: