దీపావళి పండుగ సందర్భంగా సంక్రాంతికి వచ్చే మహేశ్, బన్నీ సినిమాల కొత్త స్టిల్స్ రివీల్ అయ్యాయి. అయితే సరిలేరు.. కంటే బన్నీ అల.. వైకుంఠపురంలో దాదాపు నెల క్రితం నుంచే పబ్లిసిటీ మొదలెట్టేసింది. సామజవరగమన, రాములో రాములా పాట సెన్షేషన్ క్రియేట్ చేశాయి. అయితే.. ఈరోజు సరిలేరు.. టీమ్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది బన్నీ అల.. పై భారీ సెటైర్ వేసినట్టే ఉందంటున్నారు నెటిజన్లు.

 


ఈ వీడియోలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ సినిమా గురించి ప్రమోట్ చేస్తూ.. ‘ట్రైన్ ఎపిసోడ్.. తర్వాత సుబ్బరాజు ఎంట్రీ.. క్రైమ్ బ్రాంచ్ కోటీ.. నా అసిస్టెంట్.. తర్వాత రష్మిక ఎంట్రీ.. రష్మిక కంటే ముందు ప్రకాశ్ రాజ్.. తర్వాత రష్మిక.. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది’ అని చెప్తూండగా మధ్యలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చి.. ‘ఏం చేస్తున్నారు భయ్యా’ అని అడుగుతాడు. సినిమా ప్రమోట్ చేస్తున్నాం అని వారిద్దరూ అనగానే.. ‘భయ్యా మన సినిమా సంక్రాంతికి.. ఇది దీపావళి మాత్రమే.. అప్పుడే ఎందుకు తొందర.. ఇప్పటికే లీక్డ్ స్టిల్స్, వీడియోస్ తో చస్తుంటే లీక్డ్ స్క్రీన్ ప్లేనా’ అంటాడు. ‘సరే పెద్ద పండుగకే సినిమా చూద్దాం.. హ్యాపీ దీపావళి’ అంటూ ముగ్గురూ ఈ వీడియోలో చెప్పారు.

 


ప్రమోషన్లో అల.. ఇప్పటికే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు మహేశ్ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్లు లేవని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ టైపులో ప్లాన్ చేసింది టీమ్. ఇప్పటికే ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఓ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరి దీనిపై బన్నీ అల.. టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: