తమిళంలో గతేడాది సూపర్ హిట్టైన '96' సినిమాను కోరి మరీ తెలుగు రీమేక్ రైట్స్ తెచ్చుకున్నారు దిల్ రాజు. సాధారణంగా ఒక భాషలో హిట్టైన సినిమాని ఇప్పటివరకు రీమేక్ చేయాలని ఆలోచించని రాజు మొదటి సారి ఎందుకనో ఈ సినిమా మీద మోజుపడ్డారు. అయితే చాలా రోజులు ఈ సినిమా దర్శకుడెవరు..? హీరో -హీరోయిన్స్ ఎవరు అనే చర్చ జరిగింది. ఎట్టకేలకు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ నే ఫైనల్ చేసారు. ఆ తర్వాత శర్వానంద్-సమంతలను సెలెక్ట్ చేసారు. లాంచ్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళారు. అయితే అప్పటి నుండి ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ కూడా బయటికి రాలేదు. ఇటివలే షూటింగ్ పూర్తయిందని అంటున్నా దర్శక, నిర్మాతలనుండి ఎలాంటి సమాచారం లేదు. వాస్తవంగా చూస్తే ఈ సినిమాని దీపాళికి దిల్ రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సిన సినిమా.  

కోలీవుడ్ టాప్‌ స్టార్‌ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బిగిల్‌. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తేరి (తెలుగులో పోలీస్‌), మెర్సల్‌ (తెలుగులో అదిరింది) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సస్ ను సాదించటంతో ఇప్పుడు బిగిల్‌ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక తుస్సుమనిందని టాక్. 

ఇక మరో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కథానాయకుడిగా నటించిన ఖైదీ కూడా ఈ శుక్రవారమే విజయ్ సినిమాతో పాటే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్, తెలుగు..రెండు భాషల్లోను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకులు కూడా ఈ సినిమాని గొప్పగా ప్రశంసిస్తున్నారు. దీంతో కార్తీ కెరీర్ కి మరో కంబ్యాక్ సినిమాగా ఇండస్ట్రీ అందరి నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. నేటివిటీ కథకు తగ్గట్టే.. దిల్లీ పాత్రలో కార్తి ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతం అంటు కితాబిస్తున్నారు. అంతేకాదు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతి సన్నివేశంలో కొత్తదనాన్ని చూపించిన విధానానికి కూడా గొప్ప ప్రశంసలు దక్కాయి. దాంతో ఈ దీపావళికి గట్టిగా మోగింది ఈ సినిమానే అని అందరు చెప్పుకుంటున్నారు. 

ఇక బాలీవుడ్ లో రిలీజైన అక్షయ్ కుమార్ పూజా హెగ్డే, తుషార్-కృతి సనోన్, బాబీ డియోల్- కృతి కర్బంద వంటి భారీ తారాగణంతో వచ్చిన హౌజ్ ఫుల్-4, తాప్సీ, నటించిన సాంద్ కి ఆంఖ్, రాజ్ కుమార్ రావ్- మౌనిరాయ్ జంటగా నటించిన 'మేడ్ ఇన్ చైనా' సోసో గానే ఉన్నాయి. మొత్తానికి బాలీవుడ్ లో దీపావళి సందర్భంగా వచ్చిన ఈ మూడు సినిమాలు అసలు పేలనేలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇక తెలుగులో ఈ దీపావళికి వస్తాయనుకున్న వెంకీ మామ, మీకు మాత్రమే చెప్తా, డిస్కో రాజా...వంటి సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. దాంతో తెలుగులో ఈ దీపావళికి ఏ టపాసు పేలకుండానే ఉండిపోయాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: