టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో చిన్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఇక బాలనటుడిగానే ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న మహేష్ బాబు, పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మెల్లగా ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ, ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి దగ్గరైన హీరోల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. 

ఇకపోతే మహేష్ కూతరు సితార మరియు గౌతమ్ కూడా తండ్రి సినిమాల షూటింగులకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం, ఆ విషయాలను మహేష్ బాబు తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన కుమారుడు గౌతమ్, వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కుమార్తె సితార మాత్రం ఇంకా సినీ అరంగేట్రం మాత్రం చేయలేదు. అయినప్పటికీ చిన్నవయసు నుండి ఎంతో చలాకీగా ఉండే సితారకు ఇప్పటినుండే మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇకపోతే ఇటీవల వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి సితార ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అందులో పోస్ట్ చేస్తూ మంచి సందడి చేస్తోంది. 

ఇప్పటికే ఈ ఛానల్ కు సబ్స్క్రైబర్లు కూడా బాగానే ఉన్నారు. ఇక నేడు దీపావళి పండుగను పురస్కరించుకుని సితార మరియు ఆద్య కలిసి చక్కగా ట్రెడిషినల్ డ్రెస్సులు ధరించి ప్రేక్షకులకు దీపావళి విషెస్ చెప్పారు. అయితే ఈ వయసు నుండే మంచి మాటకారిగా పేరు దక్కించుకుంటున్న సితార, రేపు పెరిగి పెద్దయ్యాక తండ్రి మహేష్ బాబుని మించి గొప్ప పేరు సంపాదిస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: