ఎన్టీఆర్ - చరణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న  భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.   ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను శరవేగంగా  జరుపుకుంటుంది.  ప్రస్తుతం జరుగుతున్న  షెడ్యూల్  షూటింగ్ ను పూర్తి చేసుకున్నాక.. చిత్రబృందం తరువాత  షెడ్యూల్ కోసం  నార్త్ ఇండియాకు వెళ్లనుంది.  కాగా  నార్త్ ఇండియాలో జరగ బోయే షెడ్యూల్ లో ఎన్టీఆర్ - చరణ్ లతో పాటు  అజయ్ దేవగణ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అజయ్ దేవగణ్  'ఆర్ఆర్ఆర్'లో  కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తారట.  అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే  ఎన్టీఆర్ - చరణ్  పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం. 

అయితే ఈ సినిమా నుండి దీపావళికి కూడా ఎలాంటి  అప్ డేట్ రాలేదు.  ఆర్ ఆర్ ఆర్ టీం  ఎటువంటి అప్ డేట్  ఇవ్వకపోవడంతో కొన్ని పుకార్లు మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి చెప్పినట్లుగా 2020కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.  ఇద్దరు హీరోలు గాయాలు పాలుకావడంతో పాటు ఇతర కారణాల వలన అనుకున్న ప్రకారం రాజమౌళి షూటింగ్ జరుపలేకపోయారు. క్వాలిటీ విషయంలో రాజీపడని రాజమౌళి, విడుదల తేదీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఆర్.ఆర్.ఆర్ టైటిల్, హీరోల లుక్స్ ఇప్పుడే విడుదల చేయడం మంచిది కాదని రాజమౌళి భావిస్తున్నారట.  

 ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. ఈ చిత్రంలో  ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి.  అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక  రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి  ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట.  ఆ పాత్రలోనే  ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: