మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండాలా పోవాలా అన్నట్టుగా సిచువేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లు పడుతున్న సమయంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమా తో సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు మొత్తం మళ్లీ వరుసగా ఫ్లాపులు కావటంతో మార్కెట్ అంత డౌన్ కావడంతో రవితేజ కెరియర్ ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం డిస్కోరాజా అనే సినిమా చేస్తున్న రవితేజ త్వరలోనే గతంలో తనకు రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయడానికి రవితేజ సిద్ధమైనట్లు తెలుస్తోంది.


అయితే ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి గోపీచంద్ మలినేని మరియు రవితేజ పక్క ప్రణాళికలతో సిద్ధమైనట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. గతంలో డాన్ శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ర‌వితేజ 66వ చిత్ర‌మిది.ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు.


వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామ‌ని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న డిస్కో రాజా సినిమా డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: