మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 21 1991 న హత్య చేయబడ్ద విషయం తెలిసిందే. ఇక కేసులో దోషిగా జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ నిరాహార దీక్షకు దిగింది. వేలూరు మహిళా జైలులో ఉన్న ఈమె తనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తోంది. ఇన్నాల్లుగా మౌనంగా ఉన్న నళినీ కోర్టుల ద్వారా పని జరగదని భావించి తనను విడుదల చేయాలనే డిమాండుతో ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయాన్ని నళిని జైలు అధికారులకు కూడా లేఖలో రాసింది.


ఇక శనివారం ఉదయం నుండి ఆమె అల్పాహారాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. తనతోపాటు తన భర్త మురుగన్ 28 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నామని, ఇక తమను విడుదల చేయాలని నళిని డిమాండ్ చేశారు. ఇకపోతే కూతురి పెళ్లి కోసం ఇటీవలే నెల రోజులు పెరోల్‌పై నళిని బయటికి వచ్చింది. ఈ తర్వాత తన మామ ఆనారోగ్యంతో ఉన్నాడని, తనను బయటికి పంపాలని కోరింది. ఇకపోతే నళిని పెరోల్ గడువు సెప్టెంబర్ 15తో ముగిసింది. మరోపక్క రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని సహా ఏడుగురిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని యత్నాలూ చేస్తోంది.


గవర్నర్‌కు లేఖ రాసింది. అయితే, గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నళిని, ఆమె భర్త మురుగున్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే జైలు అధికారులు సర్దిచెప్పడంతో ఆ దీక్ష విరమించారు. తాజాగా నళిని ఇప్పుడు మళ్లీ దీక్షకు దిగింది. ఇకపోతే  27 ఏళ్లుగా జైల్లో ఉంటున్న ఆమె.. దేశంలోనే అత్యధిక కాలం జైల్లో ఉన్న మహిళా ఖైదీగా రికార్డుల్లోకెక్కింది..


ఇక 1991 మే 21 న ఎన్నికల ప్రచార నిమిత్తం వైజాగ్ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వెళ్లిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ  ఆత్మాహుతి సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఆ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా వారిలో నళిని ఒకరు. ఆ కేసులో నళిని శ్రీహరన్‌తో పాటు మరో ఆరుగురు దోషులుగా శిక్షను అనుభవిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: