సినిమా హీరోలకు నటనే కాకుండా తమకు ఇష్టమైన క్రీడా రంగంలో కూడా అడుగు పెడుతూంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున ఆమద్య కేరళ బ్లాస్టర్స్ అనే ఫుట్ బాల్ ను ప్రమోట్ చేశారు. చరణ్ కూడా ఆమధ్య పోలో టీమ్ లో పెట్టుబడులు పెట్టాడు. ఇలా చాలా మంది ఇతర వ్యాపకాలతో కూడా బిజీగా ఉంటున్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు భళ్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా చేరాడు.

 


ఆమధ్య ప్రో కబడ్డీని జాతీయ స్థాయిలో రానా సపోర్ట్ చేయడం తెలిసిన విషయమే. క్రీడల పట్ల అతనికున్న ఇష్టమే ప్రో కబడ్డీని ప్రమోట్ చేయించింది. దీంతో ఆ ఆటకు పబ్లిసిటీ కూడా వచ్చింది. ఈ ఇష్టమే ఇప్పుడు ఓ ఫుట్ బాల్ క్లబ్ కు ఓనర్ ను కూడా చేసింది. హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ ఓనర్స్ త్రిపురనేని వరుణ్, విజయ మాధురిలతో కలిసి ఇండియన్ సూపర్ లీగ్ లో ఈ క్లబ్ లో పెట్టుబడి పెట్టాడట. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో దీని గురించి ఓ పోస్ట్ కూడా చేశాడు. రానా ఎంట్రీతో ఫుట్ బాల్ క్రీడకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ కు మంచి రికార్డే ఉంది. గోవా, చెన్నైల్లో పలు టోర్నమెంట్లు గెలిచి మంచి ఫామ్ లో ఉంది.

 


రానా రాకతో హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ బలోపేతమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. వరుణ్ త్రిపురనేనికి గతంలో పలు ఫుట్ బాల్ క్లబ్ లతో వర్క్ చేసిన అనుభవం ఉంది. దీంతో వ్యాపారపరంగా వరుణ్, పబ్లిసిటీ పరంగా రానా హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ కు బలం చేకూరే అవకాశం ఉంది.  దీంతో మరోసారి తనకు స్పోర్ట్స్ మీద ఉన్న ఇంటరెస్ట్ ను చాటుకున్నాడు రానా.

 


view this post on Instagram

👊👊👊👊 #ComingSoon @hydfcofficial

A post shared by rana Daggubati (@ranadaggubati) on

మరింత సమాచారం తెలుసుకోండి: