మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో ఆయన నుంచి ఏడాదికి మూడు, నాలుగుకు పైగా సినిమాలు వస్తూండేవి. అలాంటి టైమ్ లో వచ్చిన చిరంజీవి మాస్ మూవీ ‘లంకేశ్వరుడు’. విజయ మాధవి కంబైన్స్ బేనర్ లో వడ్డే రమేశ్ నిర్మించిన ఈ మూవీ విడుదలై నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సరి నారాయణ రావుకు ఈ సినిమా 100వ సినిమా. చిరంజీవి – దాసరి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా కూడా ఇదే.

 

 

సినిమా 1989 అక్టోబర్ 27న విడుదలైంది. సినిమాలోని పాటలకు రాజ్ కోటీ మ్యూజిక్ అందించారు. పాటలన్నీ సూపర్ హిట్టే. పదహారేళ్ల పాప పాటలో స్టెప్స్ అప్పట్లో సెన్సేషన్. జివ్వుమని కొండగాలి పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ ఏడాది అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్న చిరంజీవికి తర్వాత వచ్చిన స్టేట్ రౌడీ ఎబౌవ్ ఏవరేజ్ కాగా.. తర్వాత వచ్చిన రుద్రనేత్ర, లంకేశ్వరుడు ఫ్లాప్ అయ్యాయి. కానీ అప్పటి చిరంజీవి క్రేజ్ పరంగా చూస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చిరంజీవి రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా వచ్చాయి. అప్పట్లో కలెక్షన్లు కంటే ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లలో సినిమా రన్ అయిందనేదే ముఖ్యం.

 


సినిమా ఫస్టాఫ్ లో డాన్ గా చిరంజీవి మాస్ ఆడియన్స్ ను పూర్తిగా ఆకట్టుకున్నారు. సెకండాఫ్ లో చెల్లెలి సెంటిమెంట్ ఎక్కువ కావడంతో అందరికీ కనెక్ట్ కాలేకపోయింది. తెలుగులో ఫ్లాప్ అయినా తమిళ్ లో డబ్బింగ్ వెర్షన్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా పాటలు, చిరంజీవి క్యారెక్టర్ పరంగా అభిమానులకు ఇష్టమైన సినిమా అనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: