ఈ సారి దీపావళికి చెప్పుకోదగ్గ తెలుగు సినిమా ఒక్కటి రాకపోయినప్పటికి వరుసగా పోస్టర్లు.. టీజర్లు.. సింగిల్స్.. ట్రైలర్లతో మన హీరోలు మోత మోగించారు. నిజంగా ఇది ఎవరు ఊహించనిది. సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురములో-డిస్కో రాజా- వెంకీ మామ-రూలర్ వంటి పెద్ద సినిమాల పోస్టర్లు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షకు తెలుపుతు రిలీజయ్యాయి. అలాగే చిన్న సినిమాల్లో శ్రీవిష్ణు- తిప్పరామీసం... నందిత శ్వేత- అక్షర.... సాయి పల్లవి- అనుకోని అతిధి... కళ్యాణ్ దేవ్- సూపర్ మచ్చి... నాగశౌర్య - అశ్వథ్థామ వంటి మీడియం రేంజ్ సినిమాల టైటిల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కల్యాణ్ రాం హీరోగా సతీష్ వేగేష్ణ తెరకెక్కిస్తున్న `ఎంతమంచి వాడవురా` .. సత్యదేవ్ - ఇషారెబ్బ జంటగా నటిస్తున్న`రాగల 24 గంటల్లో` సినిమాల పోస్టర్లు రిలీజయ్యాయి.  నిఖిల్ `అర్జున్ సురవరం సినిమా దీపావళి అప్ డేట్ కూడా అందిరింది. `ఠాగూర్`మధు సమర్పణలో రాజ్ కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుందని లేటెస్ట్ న్యూస్. 

మహేష్ మూవీ సరిలేరు నుంచి ఏకంగా మూడు స్పెషల్ పోస్టర్లు రిలీజవ్వగా.. అల వైకుంఠపురములో సినిమా నుంచి  రెండు అదిరిపోయో పోస్టర్లు రిలీజయ్యాయి. అలాగే 'రాములో రాముల' పాట మేకింగ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. వెంకీ మామ స్టిల్ లో నాగచైతన్య ఆర్మీ గెటప్ రివీలైంది. ఇక బాలయ్య రూలర్ గా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రాబోతున్నారని పోస్టర్ లో ఇంటెన్సిటీ చూస్తుంటే తెలుస్తుంది. అలాగే డిస్కో రాజాగా నటిస్తున్న రవితేజ కూడా నభాతో ఉన్న లుక్ హీటెక్కించింది.

చిన్న సినిమాల్లో సాయిపల్లవి అనుకోని అతిధి టీజర్ ఇంట్రెస్టింగా అనిపిస్తుంది. శ్రీ విష్ణు రఫ్ లుక్ లో కనిపిస్తున్న `తిప్పర మీసం` నవంబర్ 8న విడుదల కానుందని అప్‌డేట్ రావడం దీపావళి పడుగలో కాంతిని నింపింది. ఇక విజేత సినిమా నిరాశపరిచాక చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమాకి `సూపర్ మచ్చి` అనే వెరైటి టైటిల్ ని సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగశౌర్య అశ్వథ్థామ క్యూరియాసిటీ పెంచడంతో పాటు ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడని తెలుస్తుంది. ఇక కొన్ని సినిమాల పోస్టర్లలో రిలీజ్ తేదీల్ని ప్రకటించలేదు. దీంతో ఆయా సినిమాల రిలీజ్ తేదీల్లో మార్పు ఉండొచ్చని అర్థమైంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: