2019 సంవత్సరంలో అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాలు సాహో, సైరా. సాహో సినిమాను యూవీ క్రియేషన్స్ 350 కోట్ల రూపాయలతో నిర్మించగా సైరా సినిమాను రామ్ చరణ్ 270 కోట్ల రూపాయలతో నిర్మించాడు. సాహో సినిమా నిర్మాతలకు దాదాపు 50 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా దాదాపు అదే స్థాయిలో నష్టం వచ్చిందని తెలుస్తోంది. 
 
ఈ నెల 2వ తేదీన దసరా పండుగ కానుకగా విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకు టాలీవుడ్ లో హిట్ టాక్ వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ ఎక్కడా ఈ సినిమాకు హిట్ టాక్ రాలేదు. 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సైరా సినిమా ఇప్పటివరకు అన్ని భాషల్లో 142 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్లో మరో రెండు కోట్ల రూపాయలు సైరా సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వచ్చినప్పటికీ సైరా సినిమా నైజాం, వైజాగ్ ఏరియాలు మినహా మిగతా అన్ని ఏరియాల్లో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. బాలీవుడ్ లో ఫుల్ రన్లో సైరా సినిమాకు కేవలం 8 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఓవర్సీస్ లో ఫుల్ రన్లో సైరా సినిమాకు 2.5 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. 
 
సైరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమాకు దాదాపు 56 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు సమాచారం. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా ఫలితం హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ కు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. శనివారం రోజున సైరా సినిమాకు కేవలం 6 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చిందని సమాచారం. సైరా సినిమా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాలను నిర్మాత రామ్ చరణ్ ఏ విధంగా భర్తీ చేస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: