ప్రభాస్ అతడి అభిమానులకు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి ‘డార్లింగ్’ అయితే ప్రభాస్ కు మంచు కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది అన్న విషయం కొద్ది మందికే తెలిసిన నిజం. ఈమధ్య కాలంలో కొన్ని షాకులు తిన్న మంచు ఫ్యామిలీ ఆ షాకుల నుండి తేరుకుని జరుపుకున్న దీపావళి పండుగ సరదాలలో మంచు ఫ్యామిలీ తో ప్రభాస్ వచ్చి చేరడం హాట్ న్యూస్ గా మారింది.

దీనికి సంబంధించిన విషయాన్ని స్వయంగా మంచు విష్ణు షేర్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను కూడ బయటపెట్టాడు. "నా సోదరుడు.. ఇలా సూపర్ ఫన్నీగా ఉదయం/
సాయంత్రం గడిపి చాలా కాలం అయింది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  

ఈ ఫోటోలలో ప్రభాస్ విష్ణు ఇద్దరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలలో ప్రభాస్  విష్ణు లతో పాటు అతడి భార్య విరానిక కూడ కనిపించడం విశేషం.  గతంలో ప్రభాస్ ప్రభాస్ మోహన్ బాబుతో కలిసి 'బుజ్జిగాడు' సినిమాలో నటించారు.  

అప్పటినుంచి వీరి సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతోంది అని అంటారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇంత తీరిక చేసుకుని ప్రత్యేకంగా మోహన్ బాబు ఇంటికి వెళ్ళడం వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ తో పాటు ఈ దీపావళి విందు కార్యక్రమానికి వైసీపి నర్సాపురం ఎమ్.పి. రఘురామ కృష్ణరాజు కూడ రావడంతో పాటు ప్రభాస్ తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభాస్ ఈ రాజకీయ నాయకుడుతో ఏమి మాట్లాడాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇదే దీపావళి రోజున మంచు విష్ణు తన సొంత ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రకటన ఇవ్వడంతో మంచువారి కుటుంబంలో దీపావళి  సంబరాలు అంబరాన్ని అంటాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: