చరణ్ భార్యగా కాకుండా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని ఎలాంటి విషయం పై అయినా చాల స్పష్టంగా స్పందిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ప్రదాని మోడీ మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా ఇచ్చిన విందుకు దక్షిణ భారత దేశానికి చెందిన ఫిలిం సెలెబ్రెటీలను ఎవర్నీ ఆహ్వానించక పోవడం పై చాల ఘాటుగా స్పందించింది. 

ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఉపాసన చేసిన కామెంట్స్ రామ్ చరణ్ కు కూడ ఊహించని షాక్ ఇచ్చినట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి ట్విట్స్  చేసేడప్పుడు తనకు ఒక మాట చెప్పవచ్చు కదా అని తాను ఉపాసనను అడిగిన విషయాన్ని బయటపెట్టాడు. 

అయితే ఉపాసన తన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అడిగితే అలాంటి ట్విట్ చేయడానికి అంగీకరించరు కదా అంటూ సమాధానం ఇచ్చి తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ చరణ్ ఉపాసన ఉద్దేశ్యం ప్రధాని మోడీని విమర్శించడం కాదని దక్షిణ భారత సెలెబ్రెటీలకు జరిగిన అన్యాయం మోడీ దృష్టికి తీసుకు రావడం అంటూ ఉపాసన ట్విట్ లోని వేడిని తగ్గించడానికి ప్రయత్నించాడు. 

ఉపాసన ట్విట్ కు ఖుష్బూ దగ్గర నుండి అనేకమంది ఫిలిం సెలెబ్రెటీల మద్దతు లభిస్తుంటే చరణ్ మాత్రం ఉపాసన ట్విట్ కు పూర్తిగా సపోర్ట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో డైరెక్ట్ గా మోడీని టార్గెట్ చేయడం చరణ్ కు ఇష్టం లేదు అన్న సంకేతాలు కూడ ఇస్తోంది. దీనితో రానున్న రోజులలో ఉపాసన తాను చేయబోయే ప్రతి ట్విట్ చరణ్ అనుమతి తీసుకుని చేస్తుందో లేదో చూడాలి. అయితే మహిళాసాధికారిత ఎక్కువగా మాట్లాడే ఉపాసన రామ్ చరణ్ కామెంట్స్ పట్టించుకోకపోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: