మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా తెలుగు రాష్ట్రాల్లో భరీ కలెక్షన్లు సాధించింది. తెలుగు వెర్షన్ లో ఇప్పటివరకూ రంగస్థలం పేరు మీద ఉన్న 94 కోట్ల షేర్ ను దాటి నాన్ బాహుబలి రికార్డును సాధించింది. రెస్టాఫ్ ఇండియాలో కర్ణాటక తప్ప మిగిలిన ఏరియాల్లో పెద్దగా కలెక్షన్లు సాధించలేదు. హిందీలో ఈ సినిమా ప్రభావం చూపలేక పోయింది. దీనికి కారణాలను, వచ్చిన కలెక్షన్లను నిర్మాత రామ్ చరణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.

 


హిందీలో వార్ సినిమాతో పోటీ పడడం కొంత మైనస్ అయిందని చెప్పుకొచ్చాడు చెర్రీ. దీంతో పిరియాడికల్ ఫిల్మ్ గా జనాల్లోకి వెళ్లలేకపోయిందని అన్నాడు. బాలీవుడ్ లో రివ్యూలు బాగా వచ్చినా కూడా ప్రేక్షకుల్ని రప్పించలేకపోవడానికి ఇదొక కారణం అని చెప్పాడు. అయితే.. వార్ దేశవ్యాప్తంగా 300 కోట్లు కలెక్షన్లు రాబడితే సైరా దక్షిణాది నాలుగు రాష్ట్ర్రాల్లోనే 275 కోట్ల కలెక్షన్లు సాధించిందని చెప్పాడు. వార్ దేశవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లతో పోలిస్తే సైరా నాలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లే గొప్పగా అనిపించాయని చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియన్ సినిమాగా తీసినా ఆస్థాయి ఇక్కడే కనిపించిందని అన్నాడు.

 


చరణ్ చెప్పినట్టు వార్ తో పోటీపడటం అనేకంటే.. సినిమా ప్రమోషన్లలో కొణిదెల పీఆర్ టీమ్ వెనుకబడిందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. రిలీజ్ కు మూడు రోజుల ముందు అమితాబ్ తో ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేస్తే ఎంతమందికి చేరుతుందనేది కొందరి ప్రశ్న. పది రోజుల పాటు బాలీవుడ్ తో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో ప్రమోషన్ చేసుంటే సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేదని బాలీవుడ్ లో కూడా అంటున్నారు. ఏదైమైనా.. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి 64ఏళ్ల వయసులో కూడా ప్రేక్షకుల్ని మెప్పించి కలెక్షన్లు రాబట్టడం మాత్రం చిరంజీవి స్థాయి, ప్రేక్షకుల్లో ఆయనపై ఉండే నమ్మకాన్ని తెలియజేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: