మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి.. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమాకి ఫస్ట్ షో నుండే మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. వ‌సూళ్ల ప‌రంగా తెలుగు వ‌ర‌కు బాగానే రాబ‌ట్టినా మిగిలిన భాష‌ల్లో మాత్రం తేలిపోయింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు.


సైరా బాక్సాఫీస్ ర‌న్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముగిసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 105 కోట్ల షేర్‌ రాబట్టిందని సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా 187.25 కోట్ల బిజినెస్ జరిగితే గత 24 రోజుల్లో అన్ని చోట్లలో ఈ సినిమా 141.16 కోట్లను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.188 కోట్లు రావాల్సి ఉండగా దాదాపు రూ.47 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది.


ఇక సైరా గ్రాస్ లెక్కల్ని పరిశీలిస్తే.. రూ.232.11 కోట్లు రాబట్టిందని టాక్. అంటే ఓవ‌రాల్‌గా సైరా సినిమాతో రు.47 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చింది. ఇది ఈ సినిమా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌కు పెద్ద న‌ష్ట‌మే అని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక తెలుగులోనూ ఒక్క వైజాగ్‌, నైజాం మిన‌హా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. రామ్‌చ‌ర‌ణ్ సైతం బ‌య్య‌ర్ల‌కు అమౌంట్ రిట‌ర్న్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలును పూర్తి చేశారు. త్వరలో సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కొర‌టాల స్టైల్లోనే సోష‌ల్ మెసేజ్‌తో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న హీరోయిన్‌గా త్రిష పేరు వినిపిస్తోంది. మ‌రి ఎవ‌రు చిరు ప‌క్క‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకుంటారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: