నిన్న జరిగిన దీపావళి సందర్భంగా అనేక సినిమాలు తమ రిలీజ్ డేట్ ను ప్రకటించడమే కాకుండా వారి సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదలచేసి పండుగ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేసారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమంత నటిస్తున్న మూవీ మౌనం వహించడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 

తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘96’ ను తెలుగులో సమంత శర్వానంద్ లతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈమూవీ డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అందరు భావించారు. అయితే ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ‘జాను’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినప్పటికీ ఈ టైటిల్ ను ప్రకటించక పోవడానికి గల కారణం ఈమూవీ రిలీజ్ ఇప్పట్లో లేదు అని అంటున్నారు. 

డిసెంబర్ 20న క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ రవితేజా సాయి తేజ్ సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఆమూవీల మధ్య ‘96’ రీమేక్ ను దింపడం దిల్ రాజ్ కు ఇష్టం లేదు అని టాక్. ఆ తరువాత వచ్చే సంక్రాంతి సీజన్ అంతా టాప్ హీరోల సినిమాలతో ఉంటుంది కాబట్టి సంక్రాంతిలో కూడ సమంత సినిమా ఉండదు. 

దీనితో సమంత ‘96’ మూవీ రీమేక్ ఫిబ్రవరికి వెళ్ళి పోయింది అని అంటున్నారు. హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసే సమంత మూవీ హీరోల మ్యానియాకు భయపడి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆశ్చర్యంగా మారింది. హీరోలతో సమానంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా మారిన సమంత మూవీ కూడ టాప్ హీరోల రేస్ కు భయపడుతోంది అంటే ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకులలో కూడ హీరోల ఆదిపత్యం ఏవిధంగా కొనసాగుతోందో అర్ధం అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: