ఈసారి సంక్రాంతి సీజన్ కంటే డిసెంబర్  నెల టాప్ రేంజి వార్ కి రెడీ అయిపోతోంది. నిజానికి పెద్ద పండుగ వేళ పెద్ద యుధ్ధం జరుగుతుంది. అది చాలా కాలంగా వస్తున్నా ట్రెడిష‌న్. పెద్ద హీరోలంతా క్యూ కట్టి మరీ కోడి పందేలాటకు తెర తీస్తారు. కానీ ఈసారి ఎందుకో సంక్రాంతి సెంటిమెంట్ పక్కన పెట్టేస్తున్నారంతా అందులో ముందుగా చెప్పుకోవాల్సింది బాలయ్యనే.


నందమూరి బాలక్రిష్ణ తగ మూడు దశాబ్దాలుగా సంక్రాంతికి తన సినిమాను తప్పనిసరిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మంచి హిట్లు కూడా ఆయన సొంతం చేసుకుంటున్నారు కూడా. అయితే ఈ ఏడాది సంక్రాంతికి తన తండ్రి  ఎన్టీయార్ జీవిత చరిత్ర మీద తీసిన సినిమా డిజాస్టర్ కావడంతోనే బాలయ్యకు సంక్రాంతి మీద మోజు తీరిపోయిందని అంటున్నారు. దాంతో ఆయన తన కొత్త సినిమా రూలర్ ని డిసెంబర్  20న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.


ఇక విక్టరీ వెంకటేష్  తన మేనల్లుడు నాగ చైతన్యతో నటించిన వెంకీ మామ  డిసెంబర్  లోనే అంటున్నారు. నిజానికి వెంకీకి కూడా సంక్రాంతి మంచి హిట్లు ఇచ్చింది. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ చంటి సంక్రాంతికి రిలీజ్ అయినదే. ఇక ఈ ఏడాది వచ్చిన ఎఫ్ 2 మూవీ టాప్ రేంజి హిట్ కొట్టింది. అయినా వెంకీ మాత్రం సంక్రాంతిని పక్కన పెడుతున్నారు.


ఇదే వరసలో రవితేజ డిస్కో రాజా మూవీ, సాయి ధర్మ తేజ్ ప్రతి రోజు పండుగ తో పాటు మరో నాలుగైదు చిన్నా పెద్ద సినిమాలు అన్నీ  డిసెంబర్ ని టార్గెట్ చేశాయి. దాంతో అందరి చూపూ ఇపుడు  డిసెంబర్  మీద పడింది. మరి ఇందులో విజేతలు  ఎవరో చూడాల్సిందే. క్రిస్మస్ కింగ్ ఎవరో తేలాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: