తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను గత కొన్ని రోజుల నుండి అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 వచ్చేవారం తో ముగియనున్న నేపథ్యంలో టైటిల్ కోసం ఇంటిలో ఉన్న ఐదుగురు సభ్యుల మధ్య ఉన్న పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా శ్రీముఖి మరియు రాహుల్ ల పేర్లు టైటిల్ విన్నర్ గా ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యురాలు శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో..శివ జ్యోతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది.


శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో టాప్ ఫైవ్ లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా చేరుకోవటం తో ఫైనల్ వీక్ లో బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ లు వీరి చేత ఆడిస్తారు అన్నది సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. వచ్చే వారమే టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇంటిలో ఉన్న సభ్యుల మద్దతు దారులు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారానికి తెరలేపారు.


ముఖ్యంగా శ్రీముఖి మరియు రాహుల్ ల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా సోషల్ మీడియా లో ఉంది. యాంకర్ శ్రీముఖి కి టెలివిజన్ రంగంలో ఉండే సెలబ్రిటీలు చాలామంది వీడియోలు పెడుతూ శ్రీముఖి ని సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ త్రీ సీజన్ టైటిల్ శ్రీముఖి కి వచ్చేలా గెలిపించాలని ఓట్లు వేయాలని వీడియో లో పోస్ట్ చేస్తూ గట్టిగా ప్రచారం చేస్తుండగా మరో పక్క రాహుల్ కి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు సపోర్ట్ చేస్తూ రాహుల్ ని గెలిపించాలని...చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవటానికి రాహుల్ కి అన్నీ అర్హతలు ఉన్నాయని సోషల్ మీడియాలో వీడియోలు పెడితూ రాహుల్ కి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఫైనల్ వీక్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో శ్రీముఖి మరియు రాహుల్ ల పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: