తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యుల లో శివ జ్యోతి ఎలిమినేట్ కావటంతో టాప్ 5 కి శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, అలీ రెజా మరియు వరుణ్ సందేశ్ చేరిపోయారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వీక్ ఆరంభమైన నేపథ్యంలో ఇంటిలో ఎటువంటి వాతావరణం మరియు ఎటువంటి టాస్క్ లు బిగ్ బాస్ కండక్ట్ చేస్తారని చాలా ఉత్కంఠ భరితంగా చూస్తున్న వీక్షకుల లో టెన్షన్ నెలకొంది.


ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో పొద్దు పొద్దున్నే లెగిసి స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తూ ఇంటిలో ఉన్న సభ్యులందరికీ కిచెన్ లో వంటలు వండుతూ వడ్డిస్తూ ఎక్కువగా నవ్విస్తూ చాలా సక్సెస్ఫుల్ గా టైటిల్ విన్నర్ అయ్యే అర్హతలు సాధించిన బాబా భాస్కర్ నాలుక గురించి తాజాగా సోషల్ మీడియాలో కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఈ ఆదివారం శివ జ్యోతి ఇంటి నుండి ఎలిమినేట్ కావడానికి గల కారణాలలో ఒక కారణం బాబా భాస్కర్ టంగ్ పవర్ అని అంటున్నారు.


సరిగ్గా గమనిస్తే గతవారం జరిగిన ఎపిసోడ్స్ లో ఒక చోట చెట్టుకింద బాబా భాస్కర్ మాస్టర్ కూర్చుని ఉండగా శ్రీముఖి ఎదురుగా కూర్చుని ఇంటిలో ఉన్న నలుగురు సభ్యుల గురించి రకరకాల ప్రశ్నలు బాబా మాస్టర్ కి వేయగా బాబా మాస్టర్ కామెడీగా జవాబులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో శ్రీముఖి...శివ జ్యోతి గురించి ప్రశ్న వేయగా...బాబా మాస్టర్ బదులిస్తూ పోయే కాలం వస్తే ఎవడు ఆపలేడు అంటూ బాబా భాస్కర్ మాస్టర్ శ్రీముఖి కి జవాబిచ్చారు. దీంతో శ్రీముఖి పోయేకాలం అంటే...దానికి బాబా మాస్టర్ ముందు తెలుస్తుందిలే అని అనటం దాంతో వీకెండ్లో శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో...చాలామంది సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు బాబా భాస్కర్ మాస్టర్ టంగ్ చాలా డేంజర్ అని కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: