ఫిట్ నెస్ పోరి అంటే వెంటనే గుర్తొచ్చేది రకుల్ ప్రీత్ సింగ్... ఈ అమ్మడు అందంతో పాటుగా మంచి కళా పోషణ ఉన్న ముద్దుగుమ్మ కూడా.. ఈ పాత్రలో నైన ఇమిడిపోయే టాలెంట్ రకుల్ కి ఉంది. గొప్ప యాక్టరే కాదు మంచి డ్యాన్సర్ కూడా. తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించాలని తెగ ఆరాటపడుతుంది. రకుల్ ఫిగర్ కు చాలా మంది ఆమెలా ఉండాలని ట్రై చేస్తుంటారు.    


సినిమాల ఎంపిక విషయంలో ఈ అమ్మడు పాత్ర చిన్నదైన కూడా ఓకే చేసేస్తుంది. అదే రకుల్ స్పెషల్.  ఓ క్లబ్లో రోజువారీ జీతం కోసం డ్యాన్సర్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈ అమ్మడు చేస్తుంది. ఐటమ్ సాంగ్ లో వేసే దానికన్నా కూడా రకుల్ తన సెక్సీ డాన్స్ తో అందరికీ పిచెక్కించింది.హిందిలో ఈమె నటిస్తున్న చిత్రం  ‘మర్జావా’.సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే సాంగ్ వీడియో ఒకటి విడుదలైంది. తులసీ కుమార్, జుబిన్ నౌటియాల్ ఈ పాటను పాడారు. ఇందులో రకుల్ చీర కట్టుకుని క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ పాటకు ముందు హీరో బాధాకరమైన సన్నీ వేశంలో ఏడుస్తున్నప్పుడు ఈ పాట వస్తుంది. ఈ సినిమాలో హీరో తాగుబోతు కాకూదని రకుల్ ఓదారుస్తుంది. ఆ పాట నిన్న

రిలీజ్ అయింది. జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రకుల్ కు బాలీవుడ్ లో ఇది రెండో సినిమా.. దక్షిణాదిలో వచ్చినంత పాపులారిటీ బాలీవుడ్‌లోనూ రావాలని కోరుకోవడం సబబు కాదని, ఒకవేళ మార్కెట్ లో వారికి వ్యాల్యూ లేకపోయినా కూడా పాత్ర డిమాండ్ చేస్తే చేయాలని ఆమె అంటుంది.


రకుల్ ప్రీత్ తెలుగులో నటించినా చివరి సినిమా నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమాలో నటించింది.కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. విలక్షణ నటుడు భారతీయుడు 2 సినిమాలో రకుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే రకుల్ తమిళంలో శివ కార్తికేయన్ జోడిగా నటిస్తున్నారు. తెలుగు మన్మథడు సినిమా తర్వాత మరో సినిమా ఈ అమ్మడు సైన్ చేయలేదు.. ఆ పాట మీరు కూడా ఓ పారి చుడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: