లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన రెండు తమిళ సినిమాలు తమిళంలోనే కాదు తెలుగులో కూడా పోటీ పడ్డాయి. ఇళయదళపతి విజయ్ విజిల్ తో పాటుగా కార్తీ ఖైదీ కూడా రిలీజ్ అయ్యింది. రెండు సినిమాలకు మంచి హిట్ టాక్ రాగా తెలుగులో మాత్రం కార్తీ సినిమాకు ఎక్కువ మౌత్ టాక్ వచ్చింది.

 

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఫుల్ మాస్ మూవీగా వచ్చిన సినిమా ఖైదీ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ మూవీ వచ్చింది. ఇక ఈ సినిమా కు వచ్చిన పాజిటివ్ టాక్ చూసి మేకర్స్ దీనికి సీక్వెల్ ప్లానింగ్ చేస్తున్నారు. కార్తీ కూడా ఈ మూవీ సీక్వెల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 

 

దేవ్ సినిమా తో నిరాశపరచిన కార్తీ ఖైదీ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈమధ్య తమిళ సినిమాలు తెలుగులో ఆశించిన ఫలితాలని ఇవ్వట్లేదు. ఖైదీ హిట్ తో తమిళ హీరోలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ కూడా లేకపోయినా హిట్ అవడం విశేషం. 

 

ఖైదీ సినిమాను తెలుగులో కె.కె రాధామోహన్ రిలీజ్ చేశారు. సినిమా హిట్ అవడంతో ఖైదీ సీక్వెల్ అనగానే ఆడియన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. అయితే ఈ సీక్వెల్ వెంటనే ఉంటుందా లేక తర్వాత చేస్తారా అన్నది చూడాలి. ఖైదీ సినిమా హిట్ తో కార్తీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: