వెండి తెరపై హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం..పెద్దలను ఎదిరించడమే..లేదా మెప్పించడమే చేసి విలన్లను చితకబాధి మొత్తానికి పెళ్లి చేసుకుంటారు.  అయితే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నటీ,నటులు ప్రేమలో పడతారన్న విషయం తెలిసిందే.  కొంత మంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వచ్చి పెద్దల అంగీకారంతో మూడుముళ్లబంధంతో ఒక్కటవుతారు. కొంత మంది మద్యలోనే బ్రేకప్ చెప్పుకుంటారు.  ఈ మద్య కొత్త ట్రెండ్ కొనసాగుతుంది..నచ్చినంత కాలం డేటింగ్ కూడా చేసుకుంటుంటున్నారు...తర్వాత విడిపోతున్నారు. 

డేటింగ్ అనేతి సెలబ్రెటీలే కాదు కామన్ పీపుల్స్ లో కూడా మొదలైంది.  తాజాగా ఓ నటిమణికి తన బాయ్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు..ఏకంగా షూటింగ్ వదిలేసి మద్యలోనే వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..ఆరురాజా స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న మూవి. ఈ మూవీ టైటిల్ ‘బాబిలోన్’. మొదట ఈ మూవీలోకొత్త నటిని తీసుకున్నారు...కానీ ఆమె తల్లి అనారోగ్యంతో ఉండటంతో షూటింగ్ నుంచి తప్పుకుంది.  గతంలో రజనీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని చంద్రముఖి మూవీలో టైటిల్ పాత్ర బొమ్మల్ని గీసింది ఆయనే. ఇక బాబీలోన్ మూవీ కథ విషయానికి వస్తే..హీరోతన తండ్రి మరణించిన తర్వాత కొత్త చిక్కుల్లో పడిపోతాడు.

తన చెల్లెలకు సంబంధించిన ఒక వీడియోతో ఒక ముఠా బెదిరిస్తూ ఉంటుంది. ఒక దశలో హీరో చెల్లెల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం హీరోయిన్ ద్వారా తెలుసుకొని హీరో ఎలా కాపాడుకుంటాడు అన్నదే సినిమా కథ. అయితే ఈ మూవీలో తీసుకున్న హీరోయిన్ షూటింగ్ మద్యలోనే వెళ్లిపోవడానికి అసలు కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ అని చిత్రయూనిట్ కి తెలిసిందే.

సినిమా కోసం సైన్ చేసినప్పటి నుంచి ఆమెను ఏకంగా షూటింగ్ స్పాట్ కి వచ్చి మరీ టార్చర్ పెట్టేవాడని..దాంతో విసిగిపోయిన ఆమె షూటింగ్ మద్యలోనే డ్రాప్ అయ్యినట్టు చెబుతున్నారు.  ఆమె స్థానంలో మరో నటి  శ్వేతా జోయల్‌‌ను తీసుకున్నట్టు తెలిపారు. బ్లూమింగ్‌ ఆర్ట్‌ స్డూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది కుటుంబ కథా చిత్రమని వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: