కోలీవుడ్ యంగ్ హీరో కార్తి గత కొద్ది రోజులుగా తెలుగులో వరుస ప్లాపులతో తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు.. ఖాకీ, ఊపిరి లాంటి సినిమాల తర్వాత కార్తీ నటిస్తున్న సినిమాలు అన్ని వరుసపెట్టి  ప్లాప్ అవుతున్నాయి దీంతో తెలుగులో కార్తి మార్కెట్ మొత్తం ఖల్లాస్  అయింది. కార్తితో పాటు.. కార్తి సోదరుడు సూర్య సైతం తెలుగు మార్కెట్ ఎంత మాత్రం కలిసి రావడం లేదు.. ఇంకా చెప్పాలంటే సూర్య మార్కెట్ అటు తమిళంలో సైతం ఘోరంగా పడిపోయింది. హీరోలు అక్కడ మంచినీళ్లు తాగినంత సులువుగా 100 కోట్ల షేర్ సాధిస్తుంటే .. సూర్య సినిమాలో మాత్రం 50 కోట్ల షేర్  సాధించడానికి కూడా  ఆపసోపాలు పడుతున్నాయి.


హీరోయిన్ , పాటలు లేకుండా ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఖైదీ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఒక రాత్రి జరిగే కథాంశం నేపథ్యంలో స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఖైదీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సందీప్ కిష‌న్ హీరోగా న‌గ‌రం లాంటి వైవిధ్య‌మైన సినిమా తీసిన ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాయి. ఏపీ, తెలంగాణ‌లో తొలి మూడు రోజుల్లో ఖైదీ రూ .1.81 కోట్ల థియేట్రికల్ షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు రూ .3.5 కోట్లకు అమ్ముడవుతున్నాయి. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత ఖైదీకి తెలుగులో మంచి హిట్ ద‌క్కింది. ఖైదీ యొక్క మూడు రోజుల తెలుగు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.


ఖైదీ ఏపీ - తెలంగాణ 3 డేస్ క‌లెక్ష‌న్స్ :


నైజాం - 0.65


సీడెడ్ - 0.26


వైజాగ్ - 0.24


గుంటూరు - 0.14


ఈస్ట్ - 0.12


వెస్ట్ -0.10


కృష్ణ - 0.22


నెల్లూరు - 0.08
------------------------------------
ఏపీ + తెలంగాణ = 1.81 కోట్లు
-------------------------------------



మరింత సమాచారం తెలుసుకోండి: