తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవతం ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి మూడు బయోపిక్ లు తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఒకేసారి ఒక వ్యక్తి మూడు సినిమాలు రావడం వస్తుండడం కొంత ఆసక్తిగా మారింది. ఒక బయోపిక్ లో నిత్యామీనన్ అమ్మ పాత్రలో చేస్తుండగా, మరో సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా నటిస్తుంది. అయితే ఇంకో చిత్రం వెబ్ సిరీస్ రూపంలో వస్తుంది.


ఈ వెబ్ సిరీస్ లో ఒకప్పటి  రమ్యక్రిష్ణ నటిస్తుంది. అయితే ఈ మూడు సినిమాల మీద జనాలకి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే మూడు సినిమాలు మూడు విభిన్న అంశాలతో వస్తున్నాయి. ఈ సినిమాలతో జయలలిత జీవితంలోని అన్ని పార్వ్శాలు తెలుస్తాయని అనుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ కంగనా నటించే "తలైవి" సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాకి రచయితగా బాహుబలి విజయేంద్రప్రసాద్ పనిచేశారు.


కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ (మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే కంగనా పక్కన అరవింద్ స్వామి సెట్ అవుతాడా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ పాత్రలకి అనుగుణంగా తీసుకోవాలి కాబట్టి అలా తీసుకున్ని ఉంటారని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.


దానికి ప్రత్యేక మేకప్ కోసం హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. ఇప్పుడు బరువు కూడా పెరుగుతుందట. మరి అమ్మగా కంగనా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: