సౌత్ స్టార్ హీరోయిన్ గా సమంత పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరియర్ కు దాదాపు శుభం కార్డ్ పడుతుంది. కాని సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా మునుపటి ఫాం కొనసాగిస్తుంది. ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాల్లోనే నటించే సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. 


ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీతో నాగ చైతన్యకు సూపర్ హిట్ ఇచ్చిన సమంత ఓ బేబీ అంటూ వచ్చి సర్ ప్రైజ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సమంత తమిళంలో సూపర్ హిట్టైన 96 మూవీ రీమేక్ లో నటిస్తుంది. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబందించి సమంత చేసిన ఓ ట్వీట్ మొన్నామధ్య చాలా వైరల్ గా మారింది. 


కొన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందని.. ఎమోషనల్ గా ట్వీట్ చేసింది సమంత. అయితే తమిళంలో ఆల్రెడీ సూపర్ హిట్టైన 96 మూవీ తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ ఇయర్ సమ్మర్ లోనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నా ముగ్గురు హీరోలు సమంత సినిమాకు అడ్డుగా మారారు. 


డిసెంబర్ లో 96 తెలుగు రీమేక్ జాను (వర్కింగ్ టైటిల్) రిలీజ్ అనుకున్నారు. కాని డిసెంబర్ లో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 3 సినిమాలు స్టార్ హీరోలవే కావడం విశేషం. డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే, రవితేజ డిస్కో రాజా వస్తుండగా దీవాళి రోజు బాంబ్ పేల్చినట్టుగా రూలర్ అంటూ బాలకృష్ణ కూడా ఆరోజున రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ మూడు సినిమాల వల్ల డిసెంబర్ లో జాను రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడిందట. మరి జాను సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టమని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: