పాత తరం సినిమాల్లో మహానటి సావిత్రి, అందాల తార జమున తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు నటి వాణిశ్రీ.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  అక్కినేని నాగేశ్వరరావు తో నటించిన దసరాబుల్లోడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అని చెప్పొచ్చు. తాజాగా నటి వాణిశ్రీ గురించి ప్రముఖ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు.  వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఆమె కెరియర్లో ఆరంభంలో చిన్న పాత్రల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు రావాలని ఎంతో తాపత్రయపడ్డారని తెలిపారు. 

బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన వాణిశ్రీ గారిని, ఆమె తల్లిగారు ఎన్నో కష్టాలుపడి ప్రయోజాకురాలిని చేశారు.  మొదట ఆమె కన్నడంలో హిరోయిన్ గా నటించినప్పటికీ తెలుగులో మాత్రం చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించేది. కానీ ఎన్నడు కూడా తెలుగు సినీ పరిశ్రమలో తనకు చిన్న పాత్రలు వచ్చాయని ఇబ్బంది పడలేదు..ఎందుకంటే ఆమెకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎంతో మక్కువ అన్నారు. అదే సమయంలో  తమిళంలో సావిత్రిగారు చేసిన ఒక సినిమాను తెలుగులో 'మరపురానికథ' పేరుతో నిర్మించారు.

ఆ సినిమాలో నాయికగా వాణిశ్రీగారిని తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన వాణిశ్రీ ఎన్నో ఆస్తులు కూడబెట్టారు.  ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతోనే ఆమెకి అభిప్రాయ భేదాలు వచ్చాయని. తనను నమ్మంచి దారుణంగా మోసం చేశారని అప్పట్లో ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది. ఆ తరువాత అంతా రాజీ కొచ్చేసి సర్దుకుపోయారు. 

మొదటి నుంచి వాణిశ్రీ ఆద్యాత్మిక చింతన కలిగిన మనిషి...ఈ కారణంతోనే ఆమెకు క్షమాగుణం ఎక్కువ ఉండేది.  తనను మోసం చేసిన వారిని కూడా క్షమించగలిగింది. అందుకే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ‘ఎవరూ శాశ్వతం కాదు .. ఏదీ మనతో  రాదు' అనే తరహాలో ఆమె మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు జర్నలిస్ట్  బీకే ఈశ్వర్.


మరింత సమాచారం తెలుసుకోండి: