ఒకప్పుడు సినిమాలు లేని సమయంలో విధి నాటకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవి.  అంతకు ముందు తోలుబొమ్మలాటలతో అలరించేవారు.  తోలుబొమ్మలతో పురాణ గాధలు కూడా వివరించి చెప్పేవారు.  తోలుబొమ్మలాటలు చిన్నా పెద్ద అందరిని అలరించేవి. ఆ తర్వాత నాటకాలు..తర్వాత వెండి తెరపై సినిమాలు రావడంతో తొలుబొమ్మలాటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు నవ్వులరేడు..నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సినిమాలంటే కడుపుబ్బా నవ్వుకునేవారు. 

కామెడీ హీరోగా మంచి పాపులర్ అయిన రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తండ్రి, మామ, తాతయ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎన్నో సినిమాల్లో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా ఉన్నాయి. వాటిలో  చెప్పుకోదగిన సినిమాలు జాబితాలో 'మీ శ్రేయోభిలాషి' .. 'ఆ నలుగురు' సినిమాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో తన తాజా చిత్రం చేరిపోవడం కూడా ఖాయమని ఆయన భావిస్తున్నారు.  అయితే కనుమరుగైపోయిన కళలు ‘తొలుబొమ్మలాట’ పేరుతో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో సినిమా తెరకెక్కిస్తున్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. 

దుర్గాప్రసాద్ మాగంటి నిర్మాణంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.  కుటుంబాలు,బంధాలు, అవసరాలు, అవకాశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.  ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: