తెలుగు సినీ పరిశ్రమలోకి  డైలాగ్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సక్సెస్ ఫుల్  డైరెక్టర్ గా ఎదిగి, కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి. తన సినిమాల్లో ఎలాంటి గొప్ప కథ తీసుకోకుండానే..  కేవలం  తన శైలి కామెడీ క్యారెక్టరైజేషన్స్ తో,  కామెడీ  సీన్స్ తోనే సినిమాని హిట్ చెయ్యటం అంటే మాములు విషయం కాదు. పైగా తాను ఇప్పటివరకు చేసిన హీరోలందరూ..  అప్పటికే ప్లాప్ ల్లో  సతమతవుతున్న వాళ్ళే.  ముందుగా  అనిల్ మొదటి సినిమా  పటాస్ విషయానికి వస్తే.. అప్పటికే  జయీభవ, కత్తి, ఓమ్ 3డిలతో వరుస పరాజయాలను ఎదురుకుంటూ  కష్టకాలంలో ఉన్న కళ్యాణ్ రామ్ కి పటాస్ తో  కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అందించాడు అనిల్.   అలాగే మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్  కెరీర్ స్టార్టింగ్ లోనే రేయ్ లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న టైంలో  'సుప్రీమ్'తో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చి  తేజ్ కెరీర్ కే మంచి బూస్టఫ్ ఇచ్చాడు.  

ఇక అనిల్ మూడో సినిమా  'రాజా ది గ్రేట్'.  బెంగాలీ టైగర్, కిక్ 2 లతో ప్లాప్ ల్లో ఉన్న రవితేజ్ ను బ్లైండ్ క్యారెక్టర్ లో చూపించి.. మాస్ మహారాజాకి  సాలిడ్ హిట్ ఇచ్చాడు.  అదేవిధంగా  హిట్ వచ్చి చాలా కాలం అయిన వెంకీకి,  రీసెంట్ గా  'అంతరిక్షం'తో ప్లాప్ ను అందుకున్న వరుణ్ తేజ్ కు, ఇక కెరీర్ ముగిసిపోతుందనుకుంటున్న తమన్నా మెహరీన్ లకు, అలాగే  తన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలతో పాటు, స్వయంగా తన నిర్మాణంలో తెరకెక్కిన లవర్, శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో  వరుస పరాజయాలతో ఎదురుదెబ్బలు తిన్న దిల్ రాజ్ కి కూడా,   'ఎఫ్ 2' రూపంలో కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.  మొత్తానికి ప్లాప్ ల్లో ఉన్నవాళ్ళందరికీ కరెక్ట్ టైంలో  హిట్లు ఇస్తోన్న డైరెక్టర్ గా  అనిల్ రావిపూడికి గుర్తింపు రావడం నిజంగా విశేషమే.  అయితే అనిల్ ప్రస్తుతం  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు'తో కూడా హిట్ కొడతాడా ? తన విజయపరంపరను ఇలాగే కొనసాగిస్తాడా.. చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: