టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే రెండు రోజుల క్రితం దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి హీరోయిన్ రష్మిక మరియు ముఖ్య పాత్రలో నటిస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతి గారి లుక్స్ తో పాటు, 

సూపర్ స్టార్ మహేష్ బాబు బైక్ మీద వెళ్తున్న ఒక రాయల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక నేడు ఆ పోస్టర్ ఒక అత్యద్భుతమైన రికార్డు ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ సినిమా చరిత్రలో అత్యధికులు లైక్ చేసిన మూవీ పోస్టర్ గా సరిలేరులోని ఆ మహేష్ పోస్టర్ గొప్ప రికార్డుని నెలకొల్పింది. వాస్తవానికి ఆ పోస్టర్ లో మహేష్ బాబుని చూసిన ప్రతి ఒక్కరికి ఆయన వయసు మరింత తగ్గిందా అనేంత అందంగా ఉన్నారు మహేష్. ఇక ఆ పోస్టర్ ని చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే విపరీతమైన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు అనే చెప్పాలి. 

ఇక తమ హీరో పోస్టర్ ఈ విధంగా ఒక అద్భుతమైన రికార్డుని నమోదు చేయడంతో, వారు ఆ పోస్టర్ ని మరింతగా లైక్స్ మరియు షేర్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. యువ సంగీత తరంగం sri PRASAD' target='_blank' title='దేవిశ్రీ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: