‘బాహుబలి’ మూవీ ప్రత్యేక ప్రదర్శన లండన్ ఆల్బర్ట్ హాల్ లో ఈమధ్య జరిగినప్పుడు బిబిసి మీడియా సంస్థ ఆసియా విభాగం రానా ప్రభాస్ లతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను రికార్డ్ చేసింది. ఆఇంటర్వ్యూ ఈమధ్యనే ప్రసారం కూడ అయింది. ఈఇంటర్వ్యూను నిర్వహించిన మీడియా సంస్థ జర్నలిస్ట్ అనేక ఆసక్తికర ప్రశ్నలతో ప్రభాస్ రానా లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు.

‘బాహుబలి’ మూవీ కోసం దాదాపు 3 సంవత్సరాలకు పైగా అదే సినిమాను నమ్ముకుని పనిచేయడంతో కాలం వృథాగా మారిందని అనిపించలేదా అని ఆ సంస్థ ప్రతినిధి అడిగినప్పుడు రానా చాల ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు మూడు సంవత్సరాలు అదేవిధంగా మెడిసెన్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాలుగు సంవత్సరాలు కష్టపడుతూ ఉంటామని చెపుతూ చదువులో సంవత్సరాలు తరబడి కష్టపడుతున్నట్లుగా తాను ‘బాహుబలి’ కోసం కష్ట పడ్డానని తన దృష్టిలో ఈమూవీ ఒక ఉన్నతమైన డిగ్రీ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.  

ఇదే సందర్భంలో ప్రభాస్ ను కూడ అనేక ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే ప్రభాస్ చెప్పిన సమాధానాలలో స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో పాటు అతడు మాట్లాడే ఇంగ్లీష్ స్థాయి కూడ రానా మాట్లాడిన ఇంగ్లీష్ స్థాయిలో లేకపోవడంతో ఆఇంటర్వ్యూలో రానా ప్రభాస్ కంటే ఎక్కువ ప్రశంసలు పొందాడు. అంతేకాదు బ్రిటీష్ ఇంగ్లీష్ పదాలతో ఆ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించిన ప్రశ్నలలోని ఇంగ్లీష్ పదాలను అర్ధం చేసుకోవడంలో ప్రభాస్ తడబడటం స్పష్టంగా కనపడింది అని అంటున్నారు.

ఈమధ్య ‘సైరా’ బాలీవుడ్ ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడ చిరంజీవి ఇంగ్లీష్ భాషలోని మాటల తడబాటు స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా చిరంజీవి అమితాబ్ లు కలిసి ‘సైరా’ కు సంబంధించి ఫరాన్ అక్తర్ కు ఇచ్చిన ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో కూడ అమితాబ్ స్థాయిలో చిరంజీవి సమాధానాలు లేకపోవడంతో అమితాబ్ చిరంజీవి పై పైచేయి సాధించాడు. దీనితో ఈరెండు సినిమాల ఇంటర్వ్యూలను చూసిన వారు ఇంగ్లీష్ భాష విషయంలో రానా ప్రభాస్ చిరంజీవిల కన్నా రాణించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడిన రానా ఇంటర్ డ్రాప్ అవుట్ అన్న విషయం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: