అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథపై ఎప్పటినుంచో వర్క్ చేస్తున్న సుకుమార్ కు మహేశ్ హ్యాండ్ ఇవ్వగా బన్నీ ఓకే చెప్పాడు. ఈ అంశంపై ఇండస్ట్రీలో ఎంత కథ నడిచిందో తెలిసిందే. బన్నీ అల.. వైకుంఠపురంలో షూటింగ్ పూర్తికాబోతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆన్ సెట్స్ కి వెళ్లే టైమ్ దగ్గరపడుతోంది. ఇప్పుడీ సినిమాపై ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో రౌండ్ అవుతోంది.

 


తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సుకుమార్ విజయ్ సేతుపతి కోసం ట్రై చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే విజయ్ సైరాలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరో కాకపోయినా హీరో వర్షిప్ ఉన్న నటుడు. విక్రమ్ వేద, 96 సినిమాల్లో విజయ్ నటనకు తమిళ్ లో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అతని డేట్స్ కావాలంటే చాలా కష్టం.. అని మెగాస్టార్ చిరంజీవే చెప్పాడు. ప్రస్తుతం సుకుమార్ సమర్పిస్తున్న వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెనలో కూడా విజయ్ నటిస్తున్నాడు. దీంతో బన్నీ సినిమాలో కూడా విజయ్ ను నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్టు వినికిడి.

 


విజయ్ సేతుపతి బన్నీ సినిమాను ఓకే చేస్తే బన్నీకి కూడా తమిళ్ లో ఎంట్రీకి ఉపయోగపడుతుంది. ఎప్పటినుంచో తమిళ మార్కెట్ వైపు చూస్తున్న బన్నీకి కలిసిరావడం లేదు. సినిమా కథ కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ మీద అనే పుకారు నడుస్తుండటంతో ఈ సినిమా తమిళ మార్కెట్ కు కూడా సెట్ అవుతుంది. దీనిపై యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: