రానా టాప్ సెలెబ్రెటీ మాత్రమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురు కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే అలాంటి రానా తాను మోసపోయాను అంటూ స్వయంగా లీకులు ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇండస్ట్రీలో ప్రారంభం అయిన సినిమాలు కొన్ని రకరకాల కారణాలతో షూటింగ్ మధ్యలో ఆగిపోతు ఉంటాయి. నిర్మాతల ఆర్ధిక సమస్యలతో పాటు మాట పట్టింపులు వల్ల ఇగో సమస్యల వల్ల ఆగిపోయిన సినిమాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. అలాంటి ఆగిపోయిన ఒక సినిమా ఇప్పుడు రానాకు చుక్కలు చూపెడుతోంది.

రానా హీరోగా కె. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘1945’ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. సత్య శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టే ప్రీ ఇండిపెండెన్స్ కథతో రావడానికి ప్రయత్నాలు చేసింది. ఇందులో రానా ఐ.ఎన్.ఏ సైనికుడిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం అయి ఒక షెడ్యూల్ కూడ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఆగిపోయింది. 

అయితే దీపావళి సందర్భంగా ఈ మూవీ తీజర్ ను విడుదల చేస్తున్నట్లుగా ఈ మూవీ యూనిట్ ఒక ప్రకటన ఇవ్వడంతో ఆ ప్రయత్నాలకు రానా అడ్డుకట్ట వేసాడు. ఇదోరకమైన ఒక చీటింగ్ టాక్టిస్ అంటూ ఆగిపోయిన సినిమాకు టీజర్ ఏమిటి అంటూ బహిరంగంగా కామెంట్ చేయడమే కాకుండా ఈ వార్తలు చూసి ఎవరూ మోసపోవద్దు అంటూ ప్రకటన కూడ ఇచ్చాడు. దీనితో ఈ నిర్మాత ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇంతకీ ఈ మూవీ నిర్మాత పై రానాకు ఎందుకు అంత కోపం అన్న విషయమై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారి సంచలనాన్ని సృష్టిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: