సన్నీ లియోన్ ఆమె కుటుంబంతో కలిసి దీపావళిని జరుపుకుంది. ముంబాయిలో చాలా కాలం నుండి నివాసం ఉంటున్న సన్నీ, కుటుంబ సమేతంగా ఐదుగురూ కలిసి ఇలా పాల్గొనడం మొదటి సారి. ఆమె బర్త  డానియల్ వెబర్ తో కలిసి అడపా దడపా అక్కడా ఇక్కడా కనపడుతూనే ఉన్నా, మొత్తం పిల్లలు అందరితో ఇలా కలిసి కనువిందు చెయ్యడం ఇదే తొలిసారి కావడం ఒక విశేషం. ముగ్గురు పిల్లలూ, భార్యా భర్తలు ఇద్దరూ అంతా పసుపు రంగు దుస్తులు ధరించి ఫోటోలు దిగి ఇన్స్టగ్రాం లో పెట్టారు.



ఇలా మ్యాచింగ్ దుస్తులు ధరించి, "మా కుటుంబం ఆదర్శవంతం అని, అందరు మ్యాచ్ అవుతాము అని, ఇలా అందరితో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందకరం", అని తెలిపింది. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం పండుగలకు మరియూ పెళ్ళిల్లకు ధరించే లెహంగాని ధరించింది సన్నీ. ఇక ఆమె భర్త సాంప్రదాయ కుర్తా మరియూ తెల్ల పైజామాను ధరించి కనువిందు చేసారు. ఇక కవల పిల్లలు అయిన మగ పిల్లలు అషర్ మరియూ నోవా కూడా కుర్తా పైజామా వేసుకున్నారు. వారందరి డిజైన్స్ కూడా సేం వేసుకున్నారు.    



అన్నిటి కంటే ముఖ్యం అయిన విషయం ఏమిటీ అంటే, మహరాష్ట్ర లోని లాతుర్ అనే ప్రాంతం నుండి ఒక ఆడ పిల్లను సన్నీ దంపతులు దత్తత తీసుకోవడం జరిగింది. ఇది 2017 లోని మాట. ఆ తరువాత 2018 లో సర్రొగసీ పద్దతిని ఎంచుకుని ఈ దంపతులు ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.



వృత్తి రిత్యా సన్నీ పై ఎన్నో విమర్శలు ఉనా కూడా ఆమె ధైర్యంగా భారతదేశం లో నిలదొక్కుకోవడమే కాకుండా, ప్రజా సేవకి ఇలా నాంది పలికింది. సన్నీ ఈ విషయాలను మరొక్క సారి అందరికీ గుర్తు చేసేందుకు ఈ ఫోటోలను షేర్ చసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: