మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకటి హిట్లర్.  ఈ మూవీలో ఐదురు అక్కాచెళ్లెల్లకి అన్నగా నటించారు మెగాస్టార్ చిరంజీవి.  1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ ‘హిట్లర్’.  ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించారు. ఈ మూవీకి ప్రముఖ హాస్య నటులు ఎల్.బి.శ్రీరామ్ మాటలు అందించారు.   ఈ  మూవీ అప్పట్లో 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1996 లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన ఈ మూవీ తెలుగు లో రిమేక్ చేశారు. 

మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు.  ఇక టాలీవుడ్ లోకి  ముకుందా మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.  ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ..తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమాలో నటించాడు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన సినిమాలు ఒకటీ రెండు ఫెయిల్యూర్స్ అయినా..ఫిదా, తొలిప్రేమతో మంచి విజయాలు అందుకున్నాడు.  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2 ’ మంచి హిట్ అయ్యింది.   

ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించాడు వరుణ్ తేజ్. ఈ మద్య హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నటి నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢీ డ్యాన్స్ రియాల్టీ షో కి యాంకర్ గా పనిచేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా మారి రెండు మూడు సినిమాల్లో నటించింది.  కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా నిహారిక  త‌న ట్విట్ట‌ర్ ద్వారా హిట్ల‌ర్ పిక్చ‌ర్ అని ఓ ఫోటో షేర్ చేసింది. 

ఆ ఫోటోలో చిరు కూతుళ్ళు శ్రీజ‌, సుస్మిత‌తో పాటు నిహారిక ఆమె కజిన్స్ ఉన్నారు. కాకపోతే ఈ హిట్లర్ పోస్టర్ మెగాస్టార్ చిరు నటించింది కాదు..తన అన్న వరుణ్ తేజ్ తన సహసోదరీమణులతో తీసుకున్న ఫోటో. హిట్ల‌ర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి త‌న చెల్లెళ్ళ‌ని కంటికి రెప్ప‌లా ఎలా చూసుకుంటాడో, ఇక్క‌డ వ‌రుణ్ తేజ్ కూడా నిహారిక గ్యాంగ్‌కి అండ‌గా ఉంటున్నాడ‌ని త‌న కామెంట్ ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: