బుల్లితెరపై పటాస్‌ ప్రియగా ఆదరగొట్టింది.. ఖయ్యూంబాయ్‌ సినిమాలో నందమూరి తారకరత్నకు జోడీగా వెండితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ భామకి. తాజాగా విడుదలైన ‘తుపాకిరాముడు’తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ దగ్గించుకుంది ప్రియాయాదవ్‌.. తన అందం, అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీగా బాగా ప్రాముఖ్యం పొందింది. ఈ నేపథ్యంలో నవతరం కథానాయికగా అవకాశాలు ఆమెకు బాగా వచ్చాయి. పెద్దేముల్‌ మండలంలోని మారుమూల పల్లె జనగాం గ్రామానికి చెందిన ప్రియాయాదవ్‌ తనదైన నటనతో ఉమ్మడి రాష్ట్రాల ప్రేక్షకులను బాగా మోపిస్తుంది.


తాండూరు డివిజన్‌ పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి చెందిన పుల్లమొల్ల అనిత, రాములు దంపతులకు ప్రియదర్శిని, ప్రియ, ప్రవళిక ముగ్గురు కుమార్తెలు. డిగ్రీ పూర్తయ్యాక పెద్ద కూతురు ప్రియదర్శిని, చిన్నకూతురు ప్రవళికకు వివాహం చేయడం జరిగింది. రెండో కూతురు ప్రియ మాత్రం తాను జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటానని, మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేను అని తల్లిదండ్రులను ఒప్పించింది.

పెళ్లి చేసుకొని వెళితే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తనతో కాదని భావించి వివాహానికి దూరంగా ఉంది ఈ భామ. ప్రియ పుట్టిన తర్వాత తండ్రి రాములుకు రాజకీయంగా బాగా కలిసి వచ్చింది. ఆయన జనగాం గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఎంపిక అవ్వడం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీచేసిన ప్రియ తల్లి అనిత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి అయ్యారు.


ఇక  ప్రియకు చిన్నతనం నుంచి డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇది గ్రహించి తల్లిదండ్రులు ఆమెను తాండూరులోని క్లాసికల్‌ డాన్స్‌ అకాడమీలో చేర్చించారు. డాన్స్‌ మాస్టర్‌ అశోక్‌ బృందంతో కలిసి దేవాలయ ఉత్సవాలు, వినాయక మండపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ప్రియ అందరి బాగా ఆకర్షించింది ప్రియ. అనంతరం బుల్లితెర ఆర్టిస్ట్‌గా పటాస్‌ షోలో అందరిని అలరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: