తెలుగులో స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో గా  ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. కాగా  జూలై నెలలో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ప్రస్తుతం ఐదు మంది కంటెస్టెంట్స్ తో కొనసాగుతోంది. ఈవారం తో బిగ్ బాస్  సీజన్ 3 ముగియనుంది. అయితే బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 షో  గ్రాండ్ ఫినాలేకి  రాహుల్,  వరుణ్ సందేశ్, బాబా భాస్కర్,  శ్రీముఖి, అలీ రెజా  పోటీలో ఉన్నారు. మొన్న ఆదివారం శివ జ్యోతి బిగ్ బాస్  హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే గత రెండు వారాల కిందట ఎలిమినేట్ అయిన వితిక షేరు బిగ్ బాస్ విన్నర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

 

 

 

 దాదాపు 13 వారాల పాటు బిగ్ బాస్  హౌస్లో కొనసాగి తాజాగా ఎలిమినేట్  అయింది వితిక . అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన వితిక  బిగ్ బాస్ 3 విజేత గా తన భర్త వరుణ్ సందేశ్ టైటిల్ గెలుస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు  చెబుతోంది. అంతేకాకుండా వరుణ్ సందేశ్ విషయంపై తాను  పూర్తిగా కాన్ఫిడెంట్ గా ఉందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది వితిక. అయితే హౌస్ లో తాను ఉన్నప్పుడు బిగ్ బాస్  ఇచ్చిన టాస్కూల్లో  తన భర్త వరుణ్ సందేశ్ తనకంటే బాగా పెర్ఫార్మ్  చేసే వాడిని తెలిపిన వితిక ... ఒకప్పుడు తనకి చాలా కోపం ఉండేదని కానీ బిగ్ బాస్ హౌస్  లో ఉన్న కారణంగా తనకు చాలా ఓపిక పెరిగింది అని చెప్పుకొచ్చింది. ఇక ఆడియన్స్ కూడా వరుణ్ సోలోగా ఆడటానికి   ఇష్టపడతాడని అందుకే  తాను ఎలిమినేట్ అయినట్లు  తెలిపారు వితిక . 

 

 

 

 అయితే బిగ్ బాస్ లో ఉండడం వల్ల ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సోషల్ మీడియా సహకారం లేకుండానే బతుకు వచ్చు అనే నమ్మకాన్ని తమకు కలిగించిందని వితిక  తెలిపారు. ఇదిలా ఉండగా  ప్రస్తుతం బిగ్ బాస్  గ్రాండ్ ఫినాలే పోటీలో ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు.  ప్రస్తుతం ఫైనల్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎన్నో ఎలిమినేషన్ పేస్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చారు. కాగా  14 వారాలుగా షో ని  వీక్షిస్తున్న ప్రేక్షకులు... బిగ్ బాస్  ముగింపు దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలువబోతున్నారనే  దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి వితిక చెప్పినట్లు బిగ్ బాస్ విన్నర్ గా ఆమె భర్త వరుణ్ సందేశ్ టైటిల్ గెలుస్తాడా  లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: